BREAKING: ఎన్నికల ఫలితాల తేదిని మార్చిన ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మారుస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న యథాతథం జరగనుంది. By V.J Reddy 17 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Lok Sabha Elections: లోక్ సభ తో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీని శనివారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీని మారుస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2న అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టనుంది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న యథాతథం జరగనుంది. ALSO READ: సీఎం రేవంత్‌కు తప్పిన ప్రమాదం! మొత్తం ఏడు ఫేజ్‌లలో దేశంలో ఎన్నికల సంబరానికి తెరలేచింది. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం(ECI) ప్రకటించింది. దీంతో పాటు సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా ఈసీ అనౌన్స్ చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్‌ని విడుదల చేసింది. ➡ మార్చి 20న లోక్ సభ ఎలక్షన్ నోటిఫికేషన్ ➡ జూన్ 4న కౌంటింగ్ ➡ ఫేజ్ 1- ఏప్రిల్ 19 ➡ ఫేజ్ 2- ఏప్రిల్ 26 ➡ ఫేజ్ 3 – మే 7 ➡ ఫేజ్ 4-మే 13 ➡ ఫేజ్ 5- మే 20 ➡ ఫేజ్ 6- మే 25 ➡ ఫేజ్ 7- జూన్ 1 తెలుగు రాష్ట్రాల్లో ఇలా.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభ తో పాటు నాలుగు రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఇక తెలంగాణలోనూ ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో తెలంగాణలో మోగనున్న ఎన్నికల నగారా. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు.. * నోటిఫికేషన్: ఏప్రిల్ 18 * నామినేషన్లకు చివరి తేదీ: 25 ఏప్రిల్ * నామినేషన్లు స్క్రూటినీ- ఏప్రిల్ 26 * ఎన్నికల తేదీ: 13 మే 2024 * ఫలితాలు: జూన్ 4 #election-commison-of-india మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి