Turmeric: పసుపు అతిగా తీసుకుంటున్నారా.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!

పసుపులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ రోజు మనం తీసుకునే ఆహారంలో పసుపు సప్లిమెంట్స్ మోతాదుకు మించి తీసుకుంటే కడుపులో ఇబ్బంది, తల నొప్పి, జీర్ణాశయంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Turmeric:  పసుపు అతిగా తీసుకుంటున్నారా.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం..!
New Update

Turmeric: సహజంగా మనం ఇంట్లో వాడే పసుపు ఆయుర్వేదం, శాస్త్రీయ పరంగా.. దీని వల్ల ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. పూర్వ కాలం నుంచి కూడా.. పసుపును వైద్యానికి ఒక మందులా వాడతారు. ఏదైనా దెబ్బ, గాయం తగిలినప్పుడు పసుపు రాయడం వల్ల.. అది యాంటీ బయోటిక్ లా పని చేసి ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. అంతే కాదు జలుబు, దగ్గు సమస్యలకు కూడా పసుపు మంచి చిట్కాల ఉపయోగపడుతుంది.

పసుపులో 'కుర్కుమిన్' అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి, ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. కానీ ఇన్ని ఉపయోగాలు కలిగించే ఈ పసుపును మోతాదుకు మించి తీసుకుంటే.. ఆరోగ్యం పై దుష్ప్రభావాలను చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

పసుపును అధిక మోతాదులో తీసుకుంటే కలిగే సైడ్ ఎఫక్ట్స్

రోజు మనం తీసుకునే ఆహారంలో 500-2000 మిల్లి గ్రామ్స్ మోతాదులో పసుపు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా మోతాదుకు మించి దీనిని తీసుకుంటే శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

కడుపులో ఇబ్బంది:  మనం రోజు తినే ఆహారంలో మోతాదుకు మించి పసుపును తీసుకుంటే కడుపులో ఇబ్బంది, డయేరియా, జీర్ణాశయ ఇబ్బంది , యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వస్తాయి. అంతే కాదు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

తల నొప్పి, మైకం:  పసుపును శరీర మోతాదుకు మించి తీసుకున్నప్పుడు కొంత మందిలో తల నొప్పి, మైకంగా అనిపింపించడం వంటివి జరుగుతాయి.

గర్భవతులు, పాలిచ్చే తల్లులు: గర్భవతులు, పాలిచ్చే తల్లులు పసుపుతో కూడిన పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్లకు లేదా ఆల్రెడీ మెడికేషన్ పై ఉన్న వాళ్ళు పసుపు సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు జాగత్తగా ఉండాలి. ముఖ్యంగా రక్త స్రావ లోపాలు, జీర్ణాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్ల.. ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్లు పసుపు సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు వైద్యులను సంప్రదించి తీసుకోవాలి.

Also Read: Spinach Health: పాలకూర తింటే.. ఇన్ని సమస్యలు దూరమా..!

#turmeric #turmeric-side-effects
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe