/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/LS-Elections-jpg.webp)
Eelections 2024: సార్వత్రిక ఎన్నికల సందడి జోరందుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలకు గెజిట్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు మూడోవిడత లోక్‌సభ ఎన్నికలకు గెజిట్ విడుదల చేసింది. మూడోవిడతలో ఎన్నికలు జరిగే స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 12నుంచి ప్రారంభం కానుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఏప్రిల్ 19గా ప్రకటించారు. కాగా, ఏప్రిల్ 20న నామినేషన్ల పరిశీలనకు చివరి తేదీగా పేర్కొన్నారు. ఇక నామినేష్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 22 అని గెజిట్ లో తెలిపింది ఎలక్షన్ కమిషన్.
సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 94 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అసోం, బిహార్ ఛత్తీస్ గఢ్, దాద్రానగర్ హవేలీ, డామన్ & డయ్యూ.. గోవా, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్నాటక, మహారాష్ట్రలో ఈ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో మే 7వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 4న ఉంటుంది.
Also Read: పోలీసు స్టేషన్‌పై వైసీపీ నేతల దాడి.. నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు!
తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో..
కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో రాజీవ్ కుమార్ ఎన్నికల(Eelections 2024) నోటిఫికేషన్ మార్చి 16వ తేదీన ప్రకటించారు. దీంతో ఆరోజు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దేశంలో 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఏప్రిల్ 18న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, మే 13న ఓటింగ్ నిర్వహించనున్నారు. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ఉంటుంది. నాలుగో దశలో ఏపీతో పాటు తెలంగాణలో కూడా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల ఫలితాలు కూడా జూన్ 4న ప్రకటిస్తారు.