NET: నెట్‌ పరీక్ష రద్దు.. కొత్త తేదీపై కేంద్ర విద్యాశాఖ కీలక ప్రకటన

ఈ ఏడాది నిర్వహించిన నెట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో కేంద్రం పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ స్పష్టం చేశారు.

NET: నెట్‌ పరీక్ష రద్దు.. కొత్త తేదీపై కేంద్ర విద్యాశాఖ కీలక ప్రకటన
New Update

ఈ ఏడాది నిర్వహించిన నెట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు నివేదిక రావడంతో కేంద్రం ఈ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర విద్యాశాఖ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఈ పరీక్ష నిర్వహణకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినప్పటికీ విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సుమోటోగా చర్యలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ స్పష్టం చేశారు.

Also read: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్

'నెట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయని.. ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టుతో మేమి అర్థం చేసుకున్నాం. అందుకోసమే పరీక్షను రద్దు చేశాం. ప్రస్తుతం ఈ కేసు సీబీఐకి అప్పగించడం వల్ల దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించలేం. త్వరలోనే మళ్లీ పరీక్షను నిర్వహిస్తాం. అక్రమాలకు పాల్పడ్డవారిలో ఎవరైనా గాని వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ' గోవింద్ జైశ్వర్ అన్నారు.ఇదిలాఉండగా.. జూన్ 18న దేశంలో పలు నగరాల్లో ఓఎమ్మార్‌ విధానంలో యూజీసీ నెట్‌ పరీక్ష నిర్వహించారు. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరిగింది. అయితే ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయని.. భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి (ICCCC) చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూడీసీకి రిపోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం పరీక్షను రద్దు చేసింది.

ఇప్పటికే నీట్ పరీక్షలో అక్రమాలపై వివాదం కొనసాగుతుండగా.. నెట్‌ పరీక్ష రద్దు కావడం దుమారం రేపుతోంది. దీంతో కేంద్రంపై విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ లీక్, మోసాలు లేకుండా మోదీ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేకపోతున్నారని సెటైర్లు వేస్తున్నాయి. ఈ ఏడాది నిర్వహించిన నెట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలడంతో కేంద్రం పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొత్త పరీక్ష తేదీని ప్రకటిస్తామని విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైశ్వాల్ స్పష్టం చేశారు.

Also read: 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

#neet #net-exam #net
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe