AP Government: ఏపీ ప్రభుత్వం (AP GOvernment) ఉద్యోగుస్తులకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..అంగన్వాడీ అయినా..మున్సిపలు కార్మికులు అయినా టీచర్స్ అయినా రాష్ట్రంలో అందరూ ఒక్కటేనని తెలిపారు. ఇప్పటికే అంగన్వాడీలు ఇప్పటికే 11 సమస్యలు తమ ముందు ఉంచారని అందులో 10 సమస్యలకు మేము ఇప్పటికే 10 సమస్యలకు ఒప్పుకున్నాం.
మళ్లీ మా ప్రభుత్వమే....
మిగిలిన ఒకటి జీతాన్ని పెంపుదల చేయాలని అన్నారు. ఎన్నికల ముందు పెంపుదల చేయడం భావ్యం కాదని చెప్పాం. మరో నాలుగు నెలల్లో ఎలాగూ మా ప్రభుత్వం రానే వస్తుంది. జగన్ ని మరలా ముఖ్యమంత్రిని చేస్తామని బొత్స పేర్కొన్నారు. ఆ తరువాత కూర్చుని చర్చించి మీకు ఏది కావాలంటే అది చేస్తామని బొత్స అన్నారు.
వారు చెప్పిందల్లా చేశాం..
అలా కుదరదు మాకు ఇప్పుడే చేయాలి అంటే అది చాలా తప్పు కదా. ఐదేళ్ల ప్రభుత్వంలో జీతాలు పెరుగుదల గురించి ఒకసారి మాత్రమే చూస్తుంది అని తెలిపారు. ప్రతి రెండు, మూడు సంవత్సరాలకు చూడాలి అంటే అది ధర్మం కాదని అన్నారు.మున్సిపల్ కార్మికులు చెప్పిందల్లా మేం చేశాం. స్కావెంజర్స్ కి కూడా రూ.21 వేలు చేశాం. అయినా కానీ ప్రతిపక్షాలు చెప్పినట్లు చేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.
రాజకీయాల గురించి తర్వాత చూసుకుందాం..కానీ ప్రజలు తాలుకా ఆరోగ్యంతో ప్రజా కార్యక్రమాలు మీద ఇలా చేయడం సరైనది కాదని ఆయన చెప్పారు. ఇలా చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. కాబట్టి వెంటనే నిరసనలు విరమించుకుని విధుల్లో చేరండి అని వారితో చెప్పినట్లు తెలిపారు. ఎన్నికలు అయినా తర్వాత కుర్చుని మాట్లాడుకుందామని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు.
Also read: ట్రెండింగ్ లోకి ”బాయ్‌కాట్ మాల్దీవులు”..టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకుంటున్న భారతీయులు!