TS DSC : తెలంగాణ డీఎస్సీ పరీక్షలు ఎప్పటి నుంచో తెలుసా?

తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగించిన అధికారులు, పరీక్షల తేదీలను కూడా ఖరారు చేశారు. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండగా..జూన్ 20 వరకు పొడిగించింది. జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

TET : ఇకనుంచి ఏడాదికి రెండు సార్లు టెట్‌ పరీక్ష
New Update

TS DSC Exams :  తెలంగాణ(Telangana) లో డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ముఖ్యగమనిక. 11,062 ఉపాధ్యాయ పోస్టు(Teacher Posts) ల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగించింది విద్యాశాఖ. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆన్ లైన్ దరఖాస్తు(Online Application) లకు నేటితో గడువు ముగియనుంది. అయితే ఈ గడువును జూన్ 20 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ తెలిపింది. దీంతో అభ్యర్థులు రూ. 1000చొప్పున దరఖాస్తు రుసుము చెల్లించి జూన్ 20 రాత్రి 11.50గంటల వరకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే డీఎస్సీ పరీక్ష(DSC Exam) తేదీలను కూడా అధికారులు ఖరారు చేశారు. జులై 17 నుంచి 31 వరకు ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. 727 భాషా పండితులు ఉండగా...182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్ , 796 ఎస్టీటీ పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్ లో 878పోస్టులు ఉండగా.. నల్లగొండలో 605, నిజామాబాద్ లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనుంది విద్యాశాఖ.

ఇది కూడా చదవండి :  బీజేపీ స్థాపన నుంచి భారతరత్న వరకు.. అద్వానీ రాజకీయ జీవితంలో ఆసక్తికర విషయాలివే!

#telangana #ts-dsc #dsc-exams
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe