Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారం రోజు విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

New Update
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత భర్తకు ఈడీ నోటీసులు

ED Notice To Kavitha Husband Anil: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయగా.. తాజాగా ఆమె భర్తకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారం రోజు ఢిల్లీలోని తమ కార్యాలయానికి  విచారణకు హాజరుకావాలని పేర్కొంది. కవిత భర్త అనిల్, ఆమె పీఆర్వో రాజేష్ సహా మరో ముగ్గురు సిబ్బందికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో భాగంగా నలుగురు ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.

Also Read: కేసీఆర్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి సిట్టింగ్ ఎంపీ

బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు..

తెలంగాణలో కేసీఆర్ పేరు, బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. లోక్ సభ ఎన్నికలకు ముందు లబ్ధి పొందేందుకే తమ పార్టీ నాయకురాలైన కవిత పై తప్పుడు ఆరోపణలు చేసి.. కేసులు పెట్టి.. అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడంలో అర్థం ఏంటనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా కోర్టులో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. రెండు పార్టీలు కలిసి కేసీఆర్ పేరు బద్నామ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. కవిత అరెస్ట్ కు నిరసనగా శనివారం తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు