MP Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. తనపై ఈడీ దాడులు జరగొచ్చని అని ట్వీట్ చేశారు. ఓ అధికారి నుంచి తనకు దానిపై సమాచారం వచ్చిందని చెప్పారు. జులై 29న తాను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొందరికి నచ్చలేదని.. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచేస్తున్నాని అని X లో పోస్ట్ చేశారు. ఈడీ రైడ్స్ ఎదురుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి రాహుల్ చెప్పినట్లు ఆయనపై ఈడీ దాడులు జరుగుతాయా లేదా అని వేచి చూడాలి.
Also Read : సరిపోదా శనివారం అప్డేట్.. నాని యాక్షన్ మోడ్..! పోస్టర్ అదిరింది