MP Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ తనపై త్వరలో ఈడీ దాడులు జరగొచ్చని సంచలన ట్వీట్ చేశారు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఓ అధికారి తనకు ఈ సమాచారాన్ని ఇచ్చారని చెప్పారు. ఈడీ రైడ్స్ కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. తాను వీటికి భయపడే వాడిని కాదని అన్నారు. By V.J Reddy 02 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MP Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. తనపై ఈడీ దాడులు జరగొచ్చని అని ట్వీట్ చేశారు. ఓ అధికారి నుంచి తనకు దానిపై సమాచారం వచ్చిందని చెప్పారు. జులై 29న తాను పార్లమెంటులో చేసిన ‘చక్రవ్యూహం’ స్పీచ్ కొందరికి నచ్చలేదని.. ఈడీ విచారణ కోసం ఉత్సాహంగా ఎదురుచేస్తున్నాని అని X లో పోస్ట్ చేశారు. ఈడీ రైడ్స్ ఎదురుకోడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి రాహుల్ చెప్పినట్లు ఆయనపై ఈడీ దాడులు జరుగుతాయా లేదా అని వేచి చూడాలి. Apparently, 2 in 1 didn’t like my Chakravyuh speech. ED ‘insiders’ tell me a raid is being planned. Waiting with open arms @dir_ed…..Chai and biscuits on me. — Rahul Gandhi (@RahulGandhi) August 1, 2024 Also Read : సరిపోదా శనివారం అప్డేట్.. నాని యాక్షన్ మోడ్..! పోస్టర్ అదిరింది #mp-rahul-gandhi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి