ED Raids: గడ్డం వినోద్, మాజీ క్రికెటర్ల ఇళ్లలో ఈడీ సోదాలు.. బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వినోద్ ఇంటిపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వినోద్‌తో పాటు ఆయన అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లైన శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. By Shiva.K 22 Nov 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి Gaddam Vinod Kumar: బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వినోద్ ఇంటిపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. వినోద్‌తో పాటు ఆయన అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లైన శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వినోద్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై తెలంగాణ ఏసీబీ అధికారులు మూడు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు వినోద్ ఇంట్లో, ఆయన అనుచరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల వేళ ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహించడం సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగమే ఈడీ దాడులు అని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదిలాఉంటే.. మొన్నటికి మొన్న గడ్డం వినోద్ కుమార్ తమ్ముడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వివేక్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేసిన అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు, కీలక డాక్యూమెంట్స్ స్వాధీనం చేసుకుంది. Also Read: కేసీఆర్‌కు జై కొట్టిన పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి.. వీడియో వైరల్.. కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు.. #telangana-elections-2023 #ed-raids #bellampalli #gaddam-vinod-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి