Shock To Jagan Sarkar : DBT నిధులపై జగన్ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం(Election Commission) మరో లేఖ రాసింది. ఈ రోజే నగదు ఇవ్వకపోతే ఏం అవుతుందని ఈసీ ప్రశ్నించింది. జనవరిలో పథకాలకు ఇప్పటివరకు నగదు ఇవ్వని మీకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రశ్నించింది ఈసీ. ఈ మేరకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై వివరాలు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మధ్నాహ్నం 3 గంటల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. ఎన్నికల కోడ్(Election Code) నేపథ్యంలో సంక్షేమ పథకాల నిధులు లబ్ధిదారులకు చెల్లించొద్దని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలపై హైకోర్టుకు ప్రభుత్వం వెళ్లింది. దీంతో ఈ ఒక్కరోజు నగదు పంపిణీకి కోర్టు అనుమతిచ్చింది. హైకోర్టు(High Court) తీర్పుతో మళ్లీ ఈసీ అనుమతి కోరింది జగన్ ప్రభుత్వం.
Also Read : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..