EC Serious : ఏపీలో ఎన్నికల(AP Elections) సందర్భంగా చెలరేగిన హింసపై ఈసీ(Election Commission) సీరియస్ అయ్యింది. సీఎస్ జవహర్ రెడ్డి(CS Jawahar Reddy), డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు అధికారులను ఢిల్లీ(Delhi)కి రావాలని ఆదేశించింది. దీంతో రేపు సాయంత్రం ఏపీ డీజీపీ, సీఎస్ ఢిల్లీకి వెళ్లి ఈసీకి నివేదిక వివరించనున్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను వివరించనున్నారు. ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న హింసను అరికట్టడంలో డీజీపీ, సీఎస్ లు విఫలమైనట్లు ఎన్నికల కమిషన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కొనసాగుతున్న హింసపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : నెలవారీ జీతంలో 30% ఆదా చేయడం ఎలా..? దీన్ని చాలా సులభంగా పాటించండి..!
ఇదిలా ఉంటే.. ఏపీలో అల్లర్లు సృష్టించిన నిందితులను రెండ్రోజుల్లో అరెస్ట్ చేస్తామని ఈ రోజు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా(Mukesh Kumar Meena) ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేవారు. 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ కొనసాగుతోందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు.