EC Questions On CEO : మాచర్ల (Macherla) లో ఎమ్మెల్యే ఈవీఎం (EVM) లను పగలగొట్టిన ఘటనపై ఎన్నికల సంఘం (Election Commission) సీరియస్ అయ్యింది. ఈ మేరకు సీఈవోకు నోటీసులు పంపించింది. పాల్వాయి గేట్ దగ్గర ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనపై సీఈవోను వివరణ కోరింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా సీఈసీని ఈసీ ప్రశ్నించింది. ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదని సీఈసీ ప్రశ్నల వర్షం కురిపించింది. కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా? అని నిలదీసింది. ఒకవేళ నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? అని ప్రశ్నించింది. ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఏ క్షణమైనా అరెస్ట్?
కేసు నమోదు చేసి వెంటనే ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని సీఈసీ (CEC) ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంపై ఈరోజు సాయంత్రం 5 గంటల్లోపు నివేదిక ఇవ్వాలని సీఈసీ స్పష్టం చేసింది. మరోవైపు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ నుంచి హైదరాబాద్ కు ఇప్పటికే పోలీసులు చేరుకున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల అదుపులో ఎమ్మెల్యే డ్రైవర్..
బృందాలుగా విడిపోయి పిన్నెల్లి కోసం పోలీసుల గాలింపు చేస్తున్నట్లు సమాచారం. ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ లోని సంగారెడ్డి దగ్గర పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డి దగ్గర కారు లో మొబైల్ వదిలేసి పిన్నెల్లి సోదరులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
Also Read : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్ పై అదరగొట్టిన భారత సెలబ్రిటీలు!