Telangana Elections: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ బిగ్ షాక్.. కీలక అధికారుల బదిలీలు..

 ఎన్నికల ముంగిట తెలంగాణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, సీపీలను బదిలీ చేసింది ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీ అయిన పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారు.

Telangana Elections: తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ బిగ్ షాక్.. కీలక అధికారుల బదిలీలు..
New Update

Telangana IAS and IPS Officers Transfers: ఎన్నికల ముంగిట తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు, 13 మంది ఎస్పీలు, సీపీలను బదిలీ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక బదిలీ అయిన పోలీసు అధికారుల్లో తొమ్మిది మంది నాన్ క్యాడర్ అధికారులు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు బదిలీ అయ్యారు. సదరు అధికారుల పనితీరు, సంబంధిత ఇన్‌పుట్‌లను అంచనా వేసిన తర్వాత, తెలంగాణలోని రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల్లోని నలుగురు డీఈఓలను కూడా బదిలీ చేశారు.

Also Read: Nara Lokech CID Enquiry: రెండో రోజు కొనసాగుతున్న నారా లోకేష్ విచారణ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా?

బదిలీ అయిన అధికారుల వివరాలు..

తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా సదరు అధికారులు ఉదాసీనత ప్రదర్శించారంటూ పెద్ద ఎత్తు ఈసీకి ఫిర్యాదులు అందాయి. దాంతో.. ఈసీ ఈ చర్యలను తీసుకుంది. తెలంగాణలో రవాణా శాఖ కార్యదర్శి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ కమిషనర్‌ను కూడా తొలగించాలని కమిషన్‌ ఆదేశించింది. అలాగే ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కూడా నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదికూడా చదవండి: Telangana elections 2023: కిషన్‌రెడ్డి సంచలన హామీ.. అధికారంలోకి వస్తే వారికి 10 శాతం రిజర్వేషన్లు..!

ఎన్నికల కోడ్ వేళ కీలక నిర్ణయం తీసుకున్న తీసుకున్న ఈసీ.. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ కలెక్టర్ల బదిలీ చేసింది. 13 మంది ఎస్పీలు, సీపీల బదిలీ చేసింది. వీరిలో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్, వరంగల్ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్ సీపీ సత్యనారాయణ, రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరావు, ఎక్సైజ్‌ డైరెక్టర్ ముషారఫ్ అలీ, కమర్షియల్ ట్యాక్స్‌ కమిషనర్ శ్రీదేవి ఉన్నారు.

#telangana-elections #telangana-news #telangana-police #telangana-government
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe