Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన ఈసీ

నవంబర్ 30 హాలిడే కాదని తెలంగాణ ఎన్నికల ఓటింగ్ డే అని అన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు.

New Update
TS Elections 2023: ఆ నియోజకవర్గాల్లో 90 శాతం దాటిన పోలింగ్.. ఎవరికి అనుకూలం?

Telangana Elections 2023: ఎన్నికల పోలింగ్ తేదీ నవంబర్ 30న నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. దీన్ని ఉపయోగించుకుని ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉందని ఈసారి దాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. నవంబర్ 30 జరిగే ఓటింగ్ లో ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని ప్రశాంతంగా, స్వేచ్చగా తమ హక్కును వినియోగించుకోవాలని అన్నారు.

Also Read: ఐర్లాండ్ లో బీభత్సం..ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి

తెలంగాణలో 119 నియోజకవర్గాలున్నాయి. మొత్తం 3 కోట్లకు పైగా ఓటర్లున్నారు. వీరందరికీ సరిపోయేలా.. 35వేల 635 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది ఈసీ. ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌కు ఒక పరిశీలకుడిని నియమించింది. రాష్ట్రస్థాయిలో ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. ఎన్నికల కోసం 36 వేల ఈవీఎంలను ఈసీ సిద్ధం చేసింది. ఈసారి కొత్తగా ఓట్లు వేసేవారు 51 లక్షల మంది ఉన్నారు. వారందరి ఓటరు కార్డులు ప్రింట్‌ చేసి పోస్టల్ శాఖ ద్వారా ఇళ్ళకు పంపించారు అధికారులు. ఇప్పటికే 86 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. ఇక 9174మంది సర్వీస్ ఓటర్లు ఇప్పటికే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, ఛాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14లక్షలకుపైగా ప్రింట్ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్‌ల కమిషనింగ్‌ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తైంది.

రాష్ట్రంలో 35వేలకు పైగా పోలింగ్ కేంద్రాలుండగా.. 59వేల 775 బ్యాలెట్ యూనిట్‌లను రెడీ చేసింది ఈసీ. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపడుతోంది.ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ కు షాక్‌..పార్టీని విడనున్న మరో ఎమ్మెల్యే

Advertisment
Advertisment
తాజా కథనాలు