YS Jagan : ఏపీ(AP) లోని జగన్ సర్కార్(Jagan Sarkar) కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. పోలింగ్(Polling) కు ముందు వివిధ పథకాలకు సంబంధించిన నగదు బదిలీపై ఆంక్షలు విధించింది. ఎన్నికల తర్వాతనే ఆ నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని స్పష్టం చేసింది. వివిధ పథకాలకు నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇటీవల ఈసీని ఈ పథకాల నగదు బదిలీకి అనుమతి కోరింది జగన్ ప్రభుత్వం. దీంతో స్పందించిన ఈసీ కోడ్(Election Code) అమలులో ఉన్న ఈ సమయంలో నగదు బదిలీ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: AP Elections: పల్నాడు జిల్లాలో ముగ్గురు పోలీస్ అధికారులపై వేటు!
అయితే.. ప్రతిపక్షాలు మాత్రం జగన్ జనవరిలో బటన్ నొక్కి.. ఆ డబ్బులను ఇప్పుడు ఆరు నెలల తర్వాత ఎన్నికలకు ముందు రోజు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ప్లాన్ వేశారని ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ నగదును ఎప్పుడో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేవారని చెబుతున్నాయి. అధికార వైసీపీ మాత్రం పేదలపై కూటమి కుట్ర చేసిందని.. నగదు బదిలీని అడ్డుకుందని ఆరోపిస్తోంది.
ఏపీలో జగనన్న విద్యాదీవెన, లా నేస్తం తదితర పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రస్తుతం నగదు జమ కావాల్సి ఉంది. కానీ ఈసీ ఆదేశాలతో ఎన్నికల తర్వాత లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనుంది ప్రభుత్వం. తెలంగాణలోనూ రైతుబంధు స్కీమ్ పై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు నగదు బదిలీని ఆపాలని ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నగదు బదిలీ చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.