Health Tips: పుచ్చకాయ తినేటప్పుడు గింజలు పారెయవద్దు.. వాటితో అద్భుతమైన ప్రయోజనాలు!

పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, కొవ్వు, మధ్యస్థ స్థాయిలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కండరాలు, నరాల పనితీరు, రక్తంలో చక్కెరస్థాయిలు, రక్తపోటు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయ గింజల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

Health Tips: పుచ్చకాయ తినేటప్పుడు గింజలు పారెయవద్దు.. వాటితో అద్భుతమైన ప్రయోజనాలు!
New Update

Health Tips: ఈ మండే వేడిలో పండ్లు కడుపు, మనస్సు రెండింటినీ చల్లబరుస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి, వేడిని అధిగమించడానికి పుచ్చకాయ కంటే మంచి ఎంపిక మరొకటి ఉండదు. పుచ్చకాయ గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పరిశోధన ప్రకారం.. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, కొవ్వు, మధ్యస్థ స్థాయిలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలోని అనేక ప్రక్రియలకు చాలా ముఖ్యమైనది. ఇందులో కండరాలు, నరాల పనితీరు, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటును నియంత్రించడం, ప్రోటీన్లు, ఎముకలు, DNA తయారు చేయడం వంటివి ఉంటాయి. పుచ్చకాయ గింజల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

పుచ్చకాయ గింజల వలన ఉపయోగాలు:

  • పుచ్చకాయ గింజలు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లకు మంచి మూలం. ఇవి గుండె ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పెంచుతుంది.
  • గుండెపోటు, స్ట్రోక్ నుంచి గుండెను రక్షించడంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉపయోగపడతాయి. పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఈ ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • ​పుచ్చకాయలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
  • పుచ్చకాయ గింజలు లైకోపీన్‌ను కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది కూడా చదవండి: ఖర్జూరంతో టేస్టీ పుడ్‌.. ఈ రెసిపీని తెలుసుకోండి..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe