Pizza: పిజ్జా తినడం అంటే పిల్లలు నుంచి యువకులతోపాటు ఏ వయసు వారైనా తినడానికి ఇష్టపడతారు. పిజ్జా అంటే ఇష్టం లేకపోయినా అది హెల్తీ ఫుడ్ కాదనే విషయం అందరికీ తెలిసిందే. పిజ్జా ప్రాథమికంగా ఇటలీ ఆహారం. కానీ ఇటీవలి కాలంలో భారతదేశంలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది. బయట ఫుడ్ తినేవారు ఒక నెల రోజులు పిజ్జాను వదులుకోమట్టే చాలా కష్టంగా ఉంటుంది. కానీ దీనిని ప్రయత్నించినట్లయితే.. శరీరంలో చాలా మంచి ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పిజ్జా తినడం మానేస్తే ఏమి జరుగుతుందో.. శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పిజ్జా తింటే శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది:
- పిజ్జా తినడం వల్ల స్థూలకాయం అధికంగా పెరుగుతుంది. దీని కారణంగా అనేక దీర్ఘకాలిక వ్యాధులు సంభవించవచ్చు. అందుకని ఈ ఫుడ్స్ ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.
- పిజ్జాలో చాలా కేలరీలు ఉంటాయి. దీని కారణంగా దీన్ని ఎక్కువగా తింటే.. అది ఊబకాయాన్ని వేగంగా పెంచుతుంది.
- పిజ్జా ఎక్కువగా తినడం వల్ల సిరల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది, దీని కారణంగా స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.