Fast Food: ఫాస్ట్ ఫుడ్‌ ఎక్కువగా తింటే కిడ్నీలు చెడిపోతాయా? నిజమేంటి?

ఫాస్ట్‌ఫుడ్ తినటం వల్ల కిడ్నీల అనారోగ్యంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్‌, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ అధికంగా తింటే రక్తపోటు పెరుగుతుంది. ఆ ప్రభావం కిడ్నీపై పడి వాటి పనితీరు తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

New Update
Fast Food: ఫాస్ట్ ఫుడ్‌ ఎక్కువగా తింటే కిడ్నీలు చెడిపోతాయా? నిజమేంటి?

Fast Food: ఫాస్ట్‌ఫుడ్ అంటే మీకు ఇష్టమా.. దీనిని బయటకి వెళ్ళినప్పుడల్లా లాగిస్తున్నారా.. అయితే మీకు కిడ్నీలో చెడిపోతాయి జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రస్తుత కాలంలో ఎన్నో రకాల ఫుడ్‌ బయట మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఫాస్ట్ ఫుడ్. ఎంత ఫాస్ట్‌గా అవుతుందో అంత త్వరగా కూడా మన ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది బయటకు వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్‌ని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పడి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. అయితే కొందరిలో ఫాస్ట్ ఫుడ్ తినొచ్చా..? తింటే ఏమవుతుంది.. ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అని అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. ఫాస్ట్‌ఫుడ్ తింటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఈ ఆర్టికల్లో చూద్దాం.

publive-image

ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల వచ్చే సమస్యలు:

  • ఫాస్ట్ ఫుడ్ తింటే అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ఇందులో వాడే రసాయనాలు అధిక రక్తపోటును పెంచి కిడ్నీ పై ఒత్తిడి పడి వాటి పనితీరును తగ్గిస్తుంది.
  • ఫాస్ట్ ఫుడ్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, కొవ్వులు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడి వచ్చేలా చేస్తుంది. ఇది కిడ్నీలు దెబ్బతీనడానికి కారణంగా ఉంటాయి.
  • ఫాస్ట్ ఫుడ్ తింటే అధిక బరువు, మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత వచ్చే ప్రమాదం ఉంది. దీనికి కారణంగా చక్కెరపానీయాలు, డెజర్ట్‌. ఇవన్నీ కిడ్రీల ఆరోగ్యానికి హాని చేస్తాయి.
  • ఫాస్ట్‌ఫుడ్‌లో ఫైబర్ తక్కువ. కిడ్నీల పనితీరుకు ముఖ్యమైన విటమిన్లు, మినరల్స్ వంటి ముఖ్యమైన పోషకాలు లేని ఆహారం కిడ్నీల్లో రాళ్లు, ఇతర కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది.
  • ఫాస్ట్ ఫుడ్‌ను రెగ్యులర్‌గా తింటే బరువు పెరుగుట, మధుమేహం, డీ హైడ్రేషన్‌, ఊబకాయం వంటి సమస్య వస్తుంది. ఇవీ కిడ్నీ వ్యాధి ఇతర సంబంధిత ఆరోగ్య సమస్యలకు ప్రమాద కారకాలు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

 ఇది కూడా చదవండి: అలోవెరా జెల్‌ని ముఖానికి రాసుకుని నిద్రపోతారా? జరిగిది ఇదే!

Advertisment
Advertisment
తాజా కథనాలు