Aging Skin Tips: ఈ ఆహారాలు తింటే వృద్ధాప్య ఛాయలు ఉండవు

మూడు పదుల వయసులోనే వృద్ధాప్యం ఛాయలు రావటానికి మద్యం, ఒత్తిడి, జంక్ ఫుడ్, నిద్రలేమి వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారంలో బొప్పాయి పండు, టమాట, దానిమ్మ, బ్లూబెర్రీ, ద్రాక్ష వండి పండ్లు నిత్యం తీసుకుంటే యవ్వనంగా ఉంటారని సూచిస్తున్నారు.

New Update
Aging Skin Tips: ఈ ఆహారాలు తింటే వృద్ధాప్య ఛాయలు ఉండవు

Aging Skin Tips: ఉరుకుల పరుగుల జీవితం, మద్యం, ఒత్తిడి, జంక్ ఫుడ్, నిద్రలేమి వంటివి ప్రధాన కారణాలతో వృద్ధాప్యం తర్వగ వస్తుంది. మూడు పదుల వయసులోనే ఆ ఛాయలు రావటానికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు ముఖంపై కనిపిస్తాయి. ఈ సమస్య నుంచి బయట పడడానికి ఏవేవో ట్రీట్మెంట్‌లు, ఫేస్‌ ప్యాక్‌లు వాడుతారు. కానీ.. ఏం చేసినా.. సరైన ఫలితం ఉండదు. ఇలాంటి వారికి మంచి సూచనలు ఇస్తున్నారు చర్మ నిపుణులు. మనం తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే విజయం మీ సొంతం అని అంటున్నారు. ఇలా చేస్తే యాంటీ ఏజింగ్‌ లక్షణాలు పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు. మరి.. అవేంటో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రోజూ తినే ఆహారంలో ఇవి ఖచ్చితంగా ఉండాలి

బొప్పాయి పండు: బొప్పాయి పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మినరళ్లు, విటమిన్‌ ఏ, బీ, సీ, కే, ఈతోపాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పాస్ఫరస్‌లు పుష్కలంగా దొరుకుతాయి. ఇవి చర్మం సాగే లక్షణాన్ని నివారించి ముఖంపై ముడతలు పడటం లాంటి ఇబ్బందులను దూరం చేస్తుంది.
టమాట: ఈ పండు ముఖంపై ముడతలు, గీతలను త్వరగా రానివ్వవు. సి విటమిన్‌, లైకోపిన్‌ సహా యాంటీఆక్సిడెంట్స్‌ టమాటలో అధికంగా ఉంటాయి. టొమాటలో యాంటీ ఏజింగ్‌ ముఖచర్మాన్ని పొడారనివ్వకుండా ఆరోగ్యంగా, తేమగా ఉంచేందుకు ఔషధంలా పనిచేస్తుంది.
దానిమ్మ: దానిమ్మ కాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సీ చర్మంలో కొత్త కణాల వృద్ధి చేసి ముఖంపై ముడతలను తగ్గించి యవ్వనంగా చేసి చర్మాన్ని యూవీ కిరణాల నుంచి కాపాడతాయి.
బ్లూబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్స్‌, సి, ఈ విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ పండ్లల్లో బ్లూబెర్రీ ఒకటి. ఇవీ ముఖ చర్మానికి మృదుత్వాన్ని, వాతావరణ కాలుష్యం, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ పండు తింటే హైపర్‌ పిగ్మెంటేషన్‌ సమస్యను దరిచేరనివ్వవు.
ద్రాక్ష: ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వు, పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ద్రాక్షను రోజూ తింటే ఫ్రీరాడికల్స్‌తో పోరాడి చర్మకణాలను నిత్యం ఆరోగ్యంగా ఉంచి.. మెరుగైన రక్తప్రసరణకు తోడ్పడి చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది.

ఇది కూడా చదవండి: కొత్తగా పెళ్లైందా? ఈ పొరపాట్లు చేయకండి..!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు