/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Spiny-Gourd.jpg)
Spiny Gourd: బోడకాకరకాయ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. ఇది గుండ్రంగా పొట్టిగా పైన చిన్న చిన్న ముళ్లతో ఉంటుంది. అయితే ఈ కూర చాలా వెరైటీలుగా చేసుకోని తింటారు. ఈ బోడ కాకరకాయ, కాకరకాయ వల్ల చేదుగా ఉండదు. అందుకే దీనిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే బోడ కాకరకాయ సంవత్సరంలో ఒకసారి మాత్రమే దొరుకుతున్నది. మామూలు అయితే జులై, నెలలో పూతకొచ్చి ఆగస్ట్‌లో కాత ఆగిపోతుందట. ఈసారి వర్షాలు ఎక్కువగా పడటం వలన ఈ కూరగాయలు తక్కువ లభ్యమవుతున్నాయి. ఇవి ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే దొరుకుతాయి. బోడ కాకరకాయ గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
బోడకాకరకాయ ఏడాదిలో ఒకసారి మాత్రమే కాస్తుంది. మామూలు అయితే జులైలో దీని కాపు వచ్చి ఆగస్టులో కాత ఆగిపోతుంది. ఈసారి వర్షాలు ఎక్కువగా పడటం వల్ల వీటిని ఇవి మార్కెట్లో ఎక్కువగా దొరకడం లేదు. అయితే ఈ చెట్లు ఎండిపోయి మళ్లీ ఆ చెట్టు ఆనవాళ్లు కనిపించవు. కానీ భూమిలో మాత్రం దీని వేరులో ప్రాణంతోటే ఉంటుంది. మళ్లీ వేర్లు పుట్టి కాపు వేపుగా కాస్తుంది. ఇలా ఏడాదికి ఒకసారి మాత్రమే దొరికే ఈ బోడకాకరకాయను అందుకే తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొందరూ ప్రజలు బోడకాకరకాయ చికెన్ వెజిటేబుల్‌గా కూడా పిలుస్తారు. దీనిని మాంసంతో పోలుస్తారు. కొందరు చికెన్‌లో వేసుకొని కూడా దీనిని వండుతారు.
అడవిలో కాసే బోడకాకరకాయ గిరిజనులకు ఒకనెల రోజులపాటు ఉపాధి దొరుకుతుంది. ఎక్కువగా అటవీ ప్రాంతంలో దొరికే బోడ కాకరకాయను గిరిజనులు ఉదయం అడవికి వెళ్లి ఈ కాయలను కోసుకొస్తారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా అడవిలో ఈ కాకరకాయలు దొరుకుతాయి. అందుకే వాటికి అంత డిమాండ్ ఉంటుంది. సాధారణంగా మామూలు కాకరకాయ పోలిస్తే బోడ కాకరకాయకు అధిక ధర ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో 300 నుంచి 400 వరకు ఉంటుంది. గ్రామాలలోకి అయితే 250 రూపాయలకు కిలో చొప్పున ఇస్తారు. అందుకే వ్యాపారులు గ్రామాలకు వచ్చి గిరిజనుల దగ్గర ఈ పంటను కొనుక్కొని వెళ్లి పట్టణంలో అమ్ముకుంటారు.