Health Tips: : ఎండు ఖార్జూరాలను నానబెట్టి తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!

నిత్యం ఎండు ఖార్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎండు ఖార్జూరాలను డైరెక్ట్‌ గా తినడం కంటే కూడా నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

Health Tips: : ఎండు ఖార్జూరాలను నానబెట్టి తింటే..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
New Update

Dry Dates: ఎండు ఖార్జూరం..డ్రై ఫ్రూట్స్ బాక్స్‌ (Dry Fruits) లో కచ్చితంగా ఉండే ఓ ఐటమ్‌. డైలీ ఎండు ఖార్జూరాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నిత్యం ఎండు ఖార్జూరాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఎండు ఖార్జూరాలను డైరెక్ట్‌ గా తినడం కంటే కూడా నానబెట్టుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఎండు ఖర్జూరాలను నానబెట్టినప్పుడు అవి మెత్తగా అయ్యి చిన్నపిల్లలకు కూడా తినడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతే కాకుండా నానబెట్టిఏన ఖర్జూరంలో ఫైబర్‌, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. వీటిని నిత్యం తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా అందుతాయి.

అంతే కాకుండా నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల మరికొన్ని లాభాలను కూడా పొందవచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం...

మలబద్దకం నుంచి ఉపశమనం..

నానబెట్టిన ఎండు ఖర్జూరాలను డైలీ తినడం వల్ల కడుపులో పేరుకుపోయిన మలాన్ని అంతటిని కూడా బయటకు వెళ్లేలా చేస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల మలం భారాన్ని పెంచి..జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే నానబెట్టిన ఎండు ఖర్జూరాలు తింటే మలబద్దకం సమస్య ఉంటే వెంటనే తీరిపోతుంది,.

శక్తిని పొందుతారు..

ఎండు ఖర్జూరాలను తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. దీని వల్ల అలసట అనిపించదు. ఎప్పుడైనా శరీరానికి అలసటగా ఉంటే..వెంటనే రెండు ఎండు ఖర్జూరాలను నానబెట్టుకుని తింటే సరిపోతుంది. శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది.

ఎముకల ఆరోగ్యం పై ప్రభావం..
నానబెట్టిన ఎండు ఖర్జూరాలను తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. నానబెట్టిన ఎండు ఖార్జూరంలో మెగ్నీషియం, సెలీనియం, మాంగనీస్‌ వంటి అనేక ప్రయోజకరమైన ఖనిజాలు ఉన్నాయి. దీంతో ఇవి ఎముకల ఆరోగ్యం పై మంచి ప్రభావాన్ని చూపుతాయి.

శరీరానికి కావల్సిన వెచ్చదనాన్ని ఇస్తుంది.

చలికాలంలో నానబెట్టిన ఖార్జూరాలను తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన వెచ్చదనం అందుతుంది. ఈ కాలంలో కొందరు చలి ప్రభావానికి తట్టుకోలేరు. అలాంటి వారు నానబెట్టిన ఖార్జూరాలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది.

డైలీ నానబెట్టిన ఎండు ఖార్జూరాలను తినడం వల్ల చాలా ప్రయోజానాలున్నాయి. ఎల్‌డిఎల్‌తో బాధపడేవారు నానబెట్టిన ఖర్జూరాలు తినడం మంచిది.

Also read: మీరు తెలివైన బిడ్డకు జన్మనివ్వాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..!!

#healthtips #dates #soaked-dates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe