Rock Salt: ఉపవాస సమయంలో రాక్ ఉప్పును తరచుగా ఉపయోగిస్తారు. ఇది సాధారణ ఉప్పు కంటే ఆరోగ్యకరమైనది. దీన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యలు తగ్గటంతోపాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. సాధారణ రోజుల్లో కూడా రాతి ఉప్పు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాని ప్రయోజనాలపై ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
రాతి ఉప్పు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి:
- చైత్ర నవరాత్రులలో 9 రోజుల ఉపవాసం ఉంటారు. ఈ సమయంలో.. ఉపవాసం ఉండే వారు రాతి ఉప్పును కూడా ఉపయోగిస్తారు. రాక్ సాల్ట్ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.
- సముద్రం, సరస్సు నుంచి ఉప్పు నీరు ఆవిరైనప్పుడు.. అవి రంగురంగుల స్ఫటికాలను వదిలివేస్తాయి. దీని నుంచి రాక్ సాల్ట్ తయారు చేస్తారు. ఇది ఒక రకమైన ఖనిజం. ఇది తినడానికి ఉపయోగకరంగా ఉండటానికి ఎటువంటి రసాయన ప్రక్రియ అవసరం లేదు.
- దీనిని హిమాలయన్ ఉప్పు, రాతి ఉప్పు, లాహోరీ ఉప్పు అని కూడా అంటారు. రాతి ఉప్పులో 90 కంటే ఎక్కువ ఖనిజాలు ఉన్నాయి. ఇది మెగ్నీషియం, సల్ఫర్‌తో తయారు చేయడబడింది.
- సాధారణ ఉప్పుతో పోలిస్తే.. రాతి ఉప్పులో అయోడిన్ పరిమాణం తక్కువగా ఉంటుంది. పొటాషియం, కాల్షియం, జింక్ వంటి మూలకాలు ఇందులో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ప్రయోజనకరమైనవిగా చెబుతున్నారు.
- ఇనుము, మాంగనీస్, రాగి, కోబాల్ట్ కూడా రాతి ఉప్పులో ఉంటాయి. ఇవి సాదా ఉప్పు కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: జనసేన అభిమానులకు హ్యాకర్స్ షాక్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.