Banana: అరటిపండు పండిపోయిందని పడేస్తున్నారా?..ఇవి మిస్‌ అయినట్టే

అరటిపండ్లు నాలుగు రంగులలో వస్తాయి ఆకుపచ్చ, పసుపు, కొన్ని గోధుమ చుక్కలతో పసుపు, బాగా పండినవి గోధుమ రంగులో ఉంటాయి. అతిగా పండిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. అరటిపండ్ల గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Banana: అరటిపండు పండిపోయిందని పడేస్తున్నారా?..ఇవి మిస్‌ అయినట్టే
New Update

Banana: అతిగా పండిన అరటిపండ్లను చెత్తబుట్టలో పడేసేవారు చాలా మంది ఉంటారు. కానీ అందులో ఉన్న పోషకాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు. అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ ఉంటుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతుంది. అరటిపండ్లు నాలుగు రంగులలో వస్తాయి ఆకుపచ్చ, పసుపు, కొన్ని గోధుమ చుక్కలతో పసుపు, బాగా పండినవి గోధుమ రంగులో ఉంటాయి.

publive-image

పండని అరటిపండ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అవి పండినప్పుడు పసుపు రంగులోకి మారుతాయి. వీటిని కొన్ని రోజులు తినకుండా వదిలేస్తే వాటి తోలుపై గోధుమ రంగు చుక్కలు ఏర్పడతాయి. చివరికి అలాగే వదిలేస్తే బాగా గోధుమరంగులోకి మారుతుంది. చాలా మంది ప్రజలు మొదటి మూడు రంగుల అరటిపండ్లను తింటారు. అరటిపండు దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్‌మెంట్ అరటిపండ్లలోని కొన్ని ఆసక్తికరమైన రహస్యాలను బయటపెట్టింది. IFAD ప్రకారం గోధుమ రంగు అరటిపండ్లను పడేయకూడదని చెబుతున్నారు. ఈ అరటిపండ్లలో ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

publive-image

వీటిని నేరుగా తినలేకపోతే మిల్క్‌షేక్‌ చేసుకోవచ్చంటున్నారు. ఆకుపచ్చ రంగు అరటిపండ్లు రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి. ఆకుపచ్చ అరటిపండ్లు గ్లైసెమిక్ ఇండెక్స్‌లో చాలా తక్కువగా ఉంటాయి. అంటే అవి నెమ్మదిగా జీర్ణమవుతాయి. జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. రక్తంలో గ్లూకోజ్‌ తక్కువ, నెమ్మదిగా పెరుగుదలకు కారణమవుతాయని IFAD తెలిపింది. పసుపు అరటిపండ్లలో శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి:  30 ఏళ్లు దాటాక డేటింగ్‌లో ఈ తప్పులు అస్సలు చేయకండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#banana
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe