Health Tips: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనితో అనేక వంటలు, కూరలు కూడా చేస్తారు. అయితే కొందరూ ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు-ఉల్లిపాయ వేసుకొని తినే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పూర్వకాలంలో పెద్దలు ఇలాంటి అన్నం ఎక్కువగా తీనేవాళ్లు. ఆ కాలంలో టిఫినీకి దూరంగా ఉంటూ రాత్రిపూట మిగిలిన అన్నంలో పొద్దున్నే పెరుగు-ఉల్లిపాయ వేసుకొని తినేవాళ్లు. ఇప్పుడు చాలామంది పెరుగుని తినకుండా మజ్జిగ చేసుకుని తీసుకుంటున్నారు. అయితే రాత్రి అన్నంలో పెరుగు వేసుకొని ఉదయాన్నే తింటే కడుపు, ఉబ్బరం, మలబద్ధకం, పేగుల్లో పూత లాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో కొందరు రాత్రి అన్నంలో పాలు తోడేసి కలుపుకొని తింటున్నారు. ఇలా చేసిన అన్నం ఉదయానికి గడ్డగా కలిసిపోతుంది. దానిలో కొద్దిగా నీళ్లు, ఉల్లిపాయ ముక్కలు, టమోటా వేసుకొని తింటారు. మరికొందరు ఉదయాన్నే వండిన అన్నంలో పెరుగు కలుపు కలుపుకొని తింటారు. ఇలా రాత్రి అన్నంలో పెరుగు కలుపుకుని తింటే కడుపు చల్లగా ఉంటుంది. బయటకు వెళ్లినా ఎలాంటి ప్రభావం చూపదు. అంతేకాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కొంతమంది తాలింపు వేసుకొని దదోజనం టైపు తింటారు. పూరి, దోస, బోండా, లాంటి ఆయిల్ టిఫిన్లకంటే ఏ సీజన్‌లోనైనా ఇలాంటి అన్న ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: గుమ్మడి గింజలు గుండెకు మేలు!