Pumpkin Seeds: శరీరంలో కొవ్వు ప్రతి ఒక్కరికి పేరుకుపోతుంది. చెడు కోవ్వు వల్ల స్థూలకాయం, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆహార నియమాలతో పాటు వాకింగ్, ఎక్స్‌సైజులు చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే శరీరంలో చెడు కొవ్వు ఎక్కువగా ఉన్నవారు గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాకుండా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగేలా చేస్తుంది. శరీరంలోని పేగులకు కొవ్వు చేరకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో గుమ్మడి గింజలు ఉండలా చూసుకోవాలి. దీనివల్ల కొవ్వు సమస్య తగ్గటంతో పాటు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడి గింజల్లో ఫైటోస్టెరాల్ ఉంటుంది. ఫైటోస్టెరాల్‌లో కొవ్వు నిల్వలనే పోలి ఉంటాయి. గుమ్మడి గింజలను తింటే జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరే కొవ్వు శాతం తగ్గుతుంది. గుమ్మడి గింజలు తినడం వల్ల కొవ్వు తగ్గడంతో పాటు ఆర్థరైటీస్, గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. అందుకే గుమ్మడి గింజలు రెగ్యులర్ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్యని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో ఈ టిప్స్ పాటిస్తే అంటు వ్యాధులు పరార్