Ponnaganti curry health benefits: మనం రోజు తీసుకొనే ఆకు కూరల్లో శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి. నీరు పారే ప్రాంతాల్లో సంవత్సరం పొడవునా ఈ కూర పండుతుంది. విరివిగా పెరిగే ఈ ఆకుకూరలో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేస్తారు. అయితే.. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచితో పాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు ఉంటుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలున్నాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు కొన్ని తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: పన్నీర్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..?
ఈ పొన్నగంటి ఆకు కూరలో ఐరన్, ఫైబర్, క్యాల్షియం, బీటా కెరోటీన్, విటమిస్-సీ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి. ఎముకలు ధృడం ఉండాలన్న, మోకాళ్లు, కీళ్ల నొప్పులకు పొన్నగంటి కూర చాలా బాగా పనిచేస్తుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా కంటి చూపును మెరుగుపరచటంలో పొన్నగంటి కూర కీలక పాత్ర పోషిస్తుంది.
తలనొప్పితో ఇబ్బంది పడేవారు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది. మలబద్దకం సమస్య తగ్గి.. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుతుంది. అలాగే ఈ సీజన్ వచ్చే అనేక వ్యాధుల నుంచి పొన్నగంటి కూర కాపడుతుంది.
మచ్చలు, మొటిమలు ఉంటే ఈ ఆకు రసం బెస్ట్
అంతేకాదు.. పొన్నగంటి కూర రసంలో తేనె కలిపి తాగితే దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలు నుంచి ఉపశమనం పొందుతారు. పొన్నగంటి ఆకుకూరను తీంటే రక్తపోటు తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది. రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంచేదుకు కృషి చేస్తుంది. ఇకా.. ముఖం మీద మచ్చలు, మొటిమలు ఉంటే ఈ ఆకు రసం రాస్తే వెంటనే తగ్గి చర్మం రంగు మెరుగుపడుతుంది. వారానికి రెండు సార్లు పొన్నగంటి ఆకుకూరను తినటం వలన మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు.
Ponnaganti Curry: ఈ ఆకుకూర ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి..ఎందుకంటే..?
మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంతో మెలు చేస్తాయి. ప్రతీరోజు వీటిని తినటం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది. పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. పలు రకాల సమస్యలను పొన్నగంటి కూర దూరం చేస్తుంది.
New Update
Advertisment