Peaches Fruit : పీచ్ పండు తింటే మీ చర్మం మెరిసిపోతుంది.. ఎలానో తెలుసుకోండి రుచికరమైన పండ్లల్లో పీచ్ పండు ఒకటి. ఈ పీచ్ పండ్లను తింటే చర్మ ఆరోగ్యంగా, చర్మం ముడతలు పడకరుండా, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా, చర్మం దెబ్బతినకుండా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Peaches Fruit Benefits: రుచికరమైన పండ్లల్లో పీచ్ పండు ఒకటి. నేటి కాలంలో ఈ పండ్లు విరివిరిగా మార్కేట్లో లభిస్తున్నాయి. ఈ పీచ్ పండ్లు తింటే రుచితో పాటు మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ పండ్లల్లో శరీరానికి అవసరమయ్యే మినరల్స్, విటమిన్-సి, ఎ, ఇ, నియాసిస్ వంటి ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచి శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తుంది. అలాగే.. ఈ పీచ్ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కుగా ఉన్నాయి. ఇది కూడా చదవండి: జొన్న పిండితో మలబద్దకం పరార్.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు! అయితే.. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నశింపజేసి కణాల ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండ్లను తింటే గుండె ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ పండ్లల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను తింటే జీర్ణశక్తి, మలబద్దకం, డీహైడ్రేషన్, జీర్ణ సమస్యలు రావు. అంతేకాకుండా ఈ పండ్లల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఈ పీచ్ పండ్లు కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పీచ్ పండ్లల్లో విటమిన్ ఎ, సి, బీటా కెరోటిన్ వంటి ఎన్నో పోషకాలు కంటి ఆరోగ్యం, కంటి చూపు, కంటి సమస్యలు రాకుండా ఉంటుంది. ఈ పండ్లల్లో పొటాషియం ఉంటుంది. కావున ఈ పండ్లను తింటే రక్తపోటు అదుపులో ఉండి గుండె ఆరోగ్యంగా పని చేస్తుందని వైద్యులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఈ చిట్కాతో కీళ్ల నొప్పిలు తగ్గించుకోవచ్చు..అదేంటో తెలుసుకోండి! ఈ పండ్లల్లో ఫైబర్ ఎక్కువ. అలాగే.. బరువు తగ్గాలనుకునే ఈ పీచ్ పండ్లను తింటే మంచి ఫలితం ఉంటుంది. కనుక ఈ పండ్లను తింటే మనకు ఆకలి త్వరగా వేయదు. దీంతో మనం తీసుకునే క్యాలరీల సంఖ్య తగ్గి సులభంగా బరువు తగ్గవచ్చు. అయితే... ఈ పండు మన శరీర ఆరోగ్యంతోపాటు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పీచ్ పండ్లను తింటే చర్మ ఆరోగ్యంగా, చర్మం ముడతలు పడకరుండా, వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా, చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఈ విధంగా పీచ్ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ పండును తప్పకుండా రోజువారి ఆహారంలో తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. #peaches-fruit #health-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి