Immunity: రోజుకు ఒకటి తింటే శరీరం ఉక్కులా మారుతుంది

ఈ ప‌ల్లీ ఉండ‌ల టేస్ట్‌ అద్భుతంగా ఉంటుంది. పల్లీల్లో శ‌రీరానికి అవసరం అయ్యే చాలా ప్రోటీన్స్‌తో పాటు అనేక పోష‌కాలు లభిస్తాయి. పల్లిపట్టీలను రోజుకు రెండు చొప్పున తింటే శ‌రీరానికి శక్తితోపాటు రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

Immunity: రోజుకు ఒకటి తింటే శరీరం ఉక్కులా మారుతుంది
New Update

Immunity: పల్లీల్లో మ‌న శ‌రీరానికి అవసరం అయ్యే చాలా ప్రోటీన్స్‌తో పాటు అనేక పోష‌కాలు లభిస్తాయి. ప‌ల్లీల‌ను వంట‌కాల్లో వాడటమే కాక వాటితో పల్లి ఉండలు, ప‌ల్లి ప‌ట్టి చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ప‌ల్లీ ఉండ‌ల టేస్ట్‌ అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజూ వీటిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.

పల్లి ఉండల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:

ప‌ల్లీలు ఒక క‌ప్పు, బెల్లం తురుము క‌ప్పు, నీళ్లు 2 స్పూన్లు, నెయ్యి టీ స్పూన్ అవసరం అవుతాయి.

ప‌ల్లి ఉండ‌ల త‌యారీ:

ముందుగా క‌ళాయినిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. చిన్న మంట‌పై దోర‌గా వేగాక పొట్టును తీసేసి ప‌ల్లీల‌ను చిన్న ముక్కలు చేసుకోవాలి. అదే క‌ళాయిలో బెల్లం తురుము, నీరు వేసి వేడి చెయ్యాలి. బెల్లం ముదురు పాకం వ‌చ్చేలా ఉడికించి పక్కకి పెట్టుకోవాలి. బెల్లం మిశ్రమం గ‌ట్టిగా ఉంటే పాకం వ‌చ్చిన‌ట్టు. అందులో నెయ్యి వేయాలి. తర్వాత ప‌ల్లీల‌ను వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. గాలి తగలని కంటైనర్‌లో నిల్వ చేసుకోవాలి. 20 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు రెండు చొప్పున తింటే శ‌రీరానికి శక్తి లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పల్లిపట్టీలు కూడా చేసుకోవచ్చు. చిన్నారులకు ఇవి ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తితో పాటు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. బెల్లంతో చేసినవి కాబట్టి జలుబు చేసే అవకాశం కూడా ఉండదంటున్నారు. షాపుల్లో చిరుతిళ్లు కొనిచ్చేబదులు ఇంట్లోనే ఎంచక్కా వీటిని చేసి ఇస్తే ఆరోగ్యంతో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని అంటున్నారు.

ఇది కూడా చదవండి: మీరు రాత్రి సమయంలో జన్మించారా.. ఈ విషయాలు తెలుసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#immunity #palli-patties
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe