Tasty Pakoda: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నూనె లేకుండా పకోడాలు చేసుకోండిలా..!

నూనె లేని పకోడాలు తింటే ఎంతో మంచిది. ఈ పకోడాలను తింటే మంచి రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నూనె ఉపయోగించుకోకుండా పకోడాలను ఎలా తయారు చేయాలి? తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.

New Update
Tasty Pakoda: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. నూనె లేకుండా పకోడాలు చేసుకోండిలా..!

Tasty Pakoda: నూనె అవసరం లేకుండా ఎప్పుడైనా పకోడీలను చేశారా..? ఇలా చేసిన ఈ పకోడాలను తింటే మంచి రుచితోపాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పకోడీలు అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఇప్పుడు పకోడీలు చేయడానికి నూనె అవసరం లేదు. శీతాకాలంలో ఆరోగ్యకరమైన, రుచికరమైన నూనె లేని వడలను చాలా సులువుగా తయారు చేసుకోచ్చు. అయితే.. చలికాలంలో టీతో పాటు వేడి వేడి పకోడీలు తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. కానీ..ఇలా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి పరిస్థితిలో.. నూనెలో వేయించకుండా పకోడాలను తయారు చేసుకోవచ్చు. చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఇది పకోడా రుచిని ఏమాత్రం తగ్గించదు.అలాంటి పకోడా కోసం కొన్ని టిప్స్‌ను ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నీటిలో వేయించిన వడలు

  • నీటిలో వడలంటే ఇది అసాధ్యమని అనిపించవచ్చు. కానీ.. మీరు పకోడాలను నీటిలో, నూనెలో వేయించవచ్చు. దీని కోసం.. ఉడకబెట్టడానికి గ్యాస్ మీద ఒక పాత్రలో నీటిని పెట్టుకోవాలి. ఈలోపు అప్పటి వరకు పకోడా పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇలా చేసుకున్న పిండిని ఆవాల నూనెను అప్లై చేసి సిద్ధం చేయండి. ఇప్పుడు నీరు మరగటం, ఆవిరి వస్తున్నప్పుడు అందులో పకోడాలను పెట్టాలి. ఈ సమయంలో గ్యాస్ మంట ఎక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి. కాసేపట్లో పకోడీ పైకి లేస్తుంది.

ఆవిరి మీద ఉడికించాలి

  • ఆవిరిలో ఉడికించిన పకోడాలను తయారు చేయడానికి ఇడ్లీ పాన్‌లో కొంత నీరు నింపి దానిపై ఇడ్లీ అచ్చును ఉంచండి. పాన్ నాన్-స్టిక్ కాకపోతే.. నూనెతో అచ్చులకు కొద్దిగా రాయాలి. ఇప్పుడు ఒక్కో మౌల్డ్‌లో ఒక చెంచా పిండిని పోయాలి. దీనిని మూతపెట్టి 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. తిప్పి మరో 7 నిమిషాలు ఉడికించాలి. ఇది బంగారు గోధుమ రంగులోకి మారినప్పుడు, పాన్ నుంచి తీసివేసి.. చాట్ మసాలా చల్లి వేడిగా సర్వ్ చేయండి.

నూనె లేని పకోడాలు మంచిది

  • మీకు నూనె లేకుండా వేయించిన పకోడాలను తినడం ఇష్టం లేకుంటే.. నూనె లేకుండా చేయడానికి మీరు ఈ ఉపాయాన్ని ఉపయోగించవచ్చు. ముందుగా పకోడీలు వేయించే ముందు నూనెలో కొద్దిగా ఉప్పు వేయాలి. ఇలా చేయడం వల్ల పకోడా ఎక్కువ నూనె పీల్చుకోదు.ఇంకో మార్గం ఏమిటంటే.. పకోడా పిండిని సిద్ధం చేసేటప్పుడు అర టీస్పూన్ నూనె వేయాలి. శెనగపిండిలో కొద్దిగా బియ్యప్పిండి కలిపితే పకోడాలాకు నూనె ఎక్కువగా పట్టకుండా ఉంటుంది.

ఇది కూడా చదవండి: భోజనం తర్వాత సోడా, కూల్‌ డ్రింక్‌ తాగుతున్నారా? ఇక మీ పని గోవిందే!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు