Brain Tips: ఈ ఆహారాలు తింటే మీ తెలివి తేటలన్నీ కరిగిపోవడం ఖాయం

ఉప్పుతోపాటు స్వీట్‌ ప‌దార్థాలు, తీపి వంట‌కాల‌ను తగ్గించాలని, ఇవి ఆరోగ్యంతో పాటు మెదడుపైనా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మెదడుపై కూడా ఉప్పు ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అధిక ఉప్పుతో ఆరోగ్యానికి హానికరంతోపాటు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ఛాన్స్‌ ఉంటుంది.

Brain Tips: ఈ ఆహారాలు తింటే మీ తెలివి తేటలన్నీ కరిగిపోవడం ఖాయం
New Update

Brain Tips: తెలివి ఎవరి సొత్తూ కాదంటుంటారు. జ్ఞానం పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని ఆహారపదార్థాలను కూడా తింటుంటారు. డబ్బు దోచుకోవచ్చేమో కానీ తెలివితేటలను ఎవరూ తస్కరించని అంటుంటారు. తెలివితేటలను పెంచడమే కాదు తగ్గించే ఆహారాలు కూడా కొన్ని ఉంటాయి. వీటిని తీసుకుంటే మెదడు మొద్దుబారిపోయి ఆలోచనా శక్తి తగ్గుతుంది. అందుకే మెదడుపై ప్రభావం చూపే ఆహారాలను తీసుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.

publive-image

స్వీట్‌ ప‌దార్థాలు, తీపి వంట‌కాల‌ను తగ్గించాలని, ఇవి ఆరోగ్యంతో పాటు మెదడుపైనా ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. స్వీట్‌గా ఉండే వంటకాలు మెదడు పనితీరును తగ్గిస్తాయని, అందుకే వీటికి దూరంగా ఉండాలని అంటున్నారు. అంతేకాకుండా ఉప్పు లేకపోతే వంటకాలు ఉండవు, ఉప్పులేకపోతే వాటి రుచిని అస్సలు ఊహించలేము. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక ఉప్పుతో ఆరోగ్యానికి హానికరం అని వైద్యులు అంటున్నారు. గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ఛాన్స్‌ఉంటుంది. మెదడుపై కూడా ఉప్పు ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.

publive-image

ఆలోచ‌న సామ‌ర్థ్యం తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అతిగా మద్యం తాగడం వల్ల కూడా మెదడు మొద్దుబారిపోయి మనుషులు మృగాల్లా ప్రవర్తించే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మద్యపానం వల్ల మెదడు చురుకుదనం పోతుందని, ఆలోచనా శక్తి కూడా బాగా తగ్గిపోతుందని అంటున్నారు. మద్యపానం తగ్గించాలని చెబుతున్నారు. చిన్న పిల్లలకు తీపి, ఉప్పును తగ్గించి పెట్టాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి: మహబూబాబాద్‌లో విషాదం.. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత్య

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#brain-tips
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe