Salt: తక్కువ ఉప్పు తింటే కిడ్నీలకు ఏమౌతుందో తెలుసా?

శరీరంలో అధిక సోడియం అధిక రక్తపోటుకు దారితీయటంతోపాటు అంతేకాకుండా గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్ వ్యాధి, కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉప్పు తక్కువగా తింటే కిడ్నీ కణాలు బాగుపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Salt: తక్కువ ఉప్పు తింటే కిడ్నీలకు ఏమౌతుందో తెలుసా?
New Update

Salt: ఉప్పు ఆహారంలో రుచి ఇస్తుంది. కానీ..ఉప్పు తినడం చాలా సందర్భాలలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవలి పరిశోధన ప్రకారం.. తక్కువ ఉప్పు తింటే మూత్రపిండాల కణాలను రిపేర్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉప్పు తక్కువగా తింటే కిడ్నీ కణాలు బాగుపడతాయని అమెరికా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉప్పు తక్కువ తినటం వల్ల కిడ్నీలకు ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

తక్కువ ఉప్పు తింటే కిడ్నీ ఆరోగ్యం:

  • ఉప్పు తక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య కూడా నయమవుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.
  • శరీరంలో అధిక సోడియం అధిక రక్తపోటుకు దారితీస్తుంది. దీని కారణంగా.. గుండె జబ్బులు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, ఊబకాయం, ఆస్టియోపోరోసిస్, మెనియర్స్ వ్యాధి, కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి సమయంలో ఉప్పు ఎక్కువగా తినడం మానుకోవాలి.
  • శరీరంలో వాపు అనేది శరీరంలో సోడియం స్థాయిలు ఎక్కువగా ఉందనడానికి సంకేతం. WHO ప్రకారం.. పెద్దలు రోజుకు కనీసం 2,000 mg, 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తినాలి.
  • అధిక ఉప్పు చర్మానికి చాలా హానికరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఇలా చేయండి చాలు.. మీ ఇంట్లో కీటకాలాన్ని దెబ్బకి పారిపోతాయి!

#salt
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe