Health Benefits: రాగుల్లో బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుంది?

రాగులలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రాగులను బెల్లంతో కలిపి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. బెల్లంలో ఐరన్‌ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రాగుల్లో బెల్లం కలిపితే ఐరన్‌శాతం ఎక్కువ అవుతుంది.

Health Benefits: రాగుల్లో బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుంది?
New Update

Health Benefits: ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలలో రాగి ఒకటి. రాగులను బెల్లంతో కలిపి తింటే ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. రాగులలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో చాలా మంది గోధుమలు, బియ్యం స్థానంలో రాగులను ఆహారంగా తీసుకుంటున్నారు. రాగులను అనేక రకాలుగా తీసుకోవచ్చు. స్వీట్స్‌, స్నాక్స్‌గా తినవచ్చు. అంతేకాకుండా కొబ్బరి, షుగర్‌, ఉప్పు కలిపి తీసుకోవచ్చు. చాలా మంది రాగుల్లో బెల్లం కలుపుతారు. రాగులను బెల్లంతో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పంచదారకు బదులు బెల్లం వేస్తే మంచిది.

గుండె జబ్బులకు మంచిది:

  • బెల్లంలో ఐరన్‌ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రాగుల్లో బెల్లం కలిపితే ఐరన్‌శాతం ఎక్కువ అవుతుంది. రక్త ఉత్పత్తికి రాగులు కూడా చాలా మేలు చేస్తాయి. రక్తహీనత ఉన్నవారు తప్పకుండా రాగులను తినాలని నిపుణులు అంటున్నారు. పిల్లలకు రాగుల్లో చక్కెరకు బదులు బెల్లం కలిపి ఇస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు.

కొవ్వు తగ్గడానికి:

  • బరువు తగ్గాలనుకుంటే రాగులు, బెల్లం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. కొవ్వును కరిగించడంలో రాగి బాగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. అలాగే బెల్లం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచదు. అందుకే మధుమేహం ఉన్నవారు రాగి-బెల్లం కలిపి తీసుకుంటే జీర్ణక్రియ బాగుంటుంది

ఎముకల ఆరోగ్యం కోసం:

రాగి-బెల్లం కలిపి తింటే ఎముకలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. కీళ్లనొప్పులకు ఇది మంచి ఔషధం. రాగుల్లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. బెల్లంలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవన్నీ ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. రెండు కలిపి తింటే శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవని, రోగ నిరోధకశక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: పామాయిల్ ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏమంటున్నారు?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe