Guava Benefits: రుచితో పాటు ఆరోగ్యాన్నీ ఇచ్చే జామ ఉపయోగమే వేరు. సీజనల్ ఫ్రూట్స్‌లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అందువల్ల జలుబు, ఇన్ఫెక్షన్లు, దగ్గుల్లాంటి సమస్యలు దరిచేరవు. జామ తినటం వల్లన శరీరంలో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతోంది. అంతేకాదు డయాబెటిస్‌తో బాధపడేవారూ దీనిని తినొచ్చు. జామలో విటమిన్-ఎ ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. రోజు జామ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
జామకాయ తినటం వల్ల కలిగే ఉపయోగాలు
- రోజు జామ పండు తింటే శక్తి ఎక్కువగా వస్తుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
- ముఖ్యంగా ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గిపోతాయి. జుట్టు పెరుగుతోంది, నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
- జామపండు తింటే కండరాలకు విశ్రాంతి కలిగి ఒత్తిడి నుంచి బయటపడుతారు.
- జామ ఆకులు కూడా హెల్త్‌కి ఎంతో మేలు చేస్తాయి. జామాకులు నమిలితే నోటిలో ఉండే క్రిములు నశించి నోరు శుభ్రంగా ఉంటుంది. ఇది టూత్‌పేస్ట్‌లా పని చేస్తుంది.
- ఈ పండు తినటం వల్ల హైపర్‌టెన్షన్‌కు గురికాకుండా బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రిస్తుంది. దీంతో గుండెకు సంబంధించిన సమస్యలు దరిచేరవు.
- జామలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారి డైట్‌లో జామపండు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- ఆపిల్, బొప్పాయి, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్ధం అధికం.
- షుగరు వ్యాధితో బాధపడేవారు తప్పనిసరిగా తినవల్సిన కాయ జామకాయ.
- డయాబెటిస్ రోగులకు సంజీవనిలా జామకామ పనిచేస్తోంది
- నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు జామ దివ్యౌషధంలా పనిచేస్తుంది
- గర్భిణులకు అవసరమైన ఫోలిక్ యాసిడ్ అందడంతోపాటు సంతానోత్పత్తిని పెంచే హార్మోల్లను జామకాయ ఉత్పత్తి చేస్తుంది.
ఇది కూడా చదవండి: వామాకుతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా..?
ఎరుపు, తెలుపు రంగు గుజ్జుతో ఉండే జామ అంటే అందరూ ఇష్టంగా తింటారు. వగరు, పులుపుతో కూడిన తియ్యని రుచి కలిగిన జామకాయ ఈ సీజన్‌లో ఎక్కువగా దొరుకుతాయి. పెరటి చెట్టుగా భావించే జామలో అధిక పోషకాలున్నాయి. జామ పండ్లలో పీచు, విటమిన్- ఎ, సి, ఫోలిక్ ఆమ్లాల శాతం ఎక్కువ ఉన్నాయి. మాంగనీస్, పొటాషియం, కాపర్ వంటి ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి.ఈ పండు మనకు అందుబాటు ధరలో, దగ్గరగానే దొరుకుతుంది. వాస్తవానికి యాపిల్, మామిడి, కమలాపండు, స్ట్రాబెర్రీ పళ్లకన్నా ఎక్కువ సి-విటమిన్లు జామలోనే నాలుగు రెట్లు ఎక్కువ ఉంటాయి.