Green Chillies: పచ్చిమిర్చి తింటే అందం పెరుగుతుందా..? ఇందులో నిజమెంత?

పచ్చిమిర్చి ఆహారంలో కీలకపాత్ర పోషించడంతోపాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు ఇస్తుంది. వీటిలో విటమిన్- సి, లుటిన్‌, జియాక్సంతిన్‌, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచటంతోపాటు అందం పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

New Update
Green Chillies: పచ్చిమిర్చి తింటే అందం పెరుగుతుందా..? ఇందులో నిజమెంత?

Green Chillies: అందం పెంచుకోవడానికి మార్కెట్లో రకరకాల వస్తువులను వాడుతూ ఉంటారు. ఎన్ని వస్తువులు వాడిన సరైన ఆహారం కూడా అందం పెంచడానికి ముఖ్యమైన భాగమని చర్మ నిపుణులు అంటుంటారు. అయితే తాజాగా చేసిన పరిశోధనలో పచ్చిమిరపకాయలలో అందం పెంచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఆహారంలో కీలకపాత్ర పోషించడంతోపాటు శరీరానికి కావాల్సిన విటమిన్లు ఇస్తుంది. వీటిలో విటమిన్- సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడి దృష్టిని మెరుగుపడేలా చేస్తుంది. పచ్చిమిర్చిలో లుటిన్‌, జియాక్సంతిన్‌, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

ముఖంపై మచ్చలు తగ్గిస్తుంది:

  • ఇవి శరీరానికి రక్తప్రసరణను ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఇవి కాపాడుతాయి. జలుబు ఉంటే పచ్చిమిరపకాయలతో చెక్‌పెట్టొచ్చు. పచ్చిమిర్చిలో ఉండే పోషకాలు చర్మానికి నిగారింపుని ఇస్తుంది. అందం కూడా పెరుగుతుందట. ఎందుకంటే ముఖంపై మచ్చలు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందాన్ని పెంచడంలో పచ్చిమిరపకాయ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అందుకే కొంతమంది పచ్చిమిరపకాయ చట్నీ రెండు మూడు రోజులకు ఒకసారి తింటూ ఉంటారు. మిరపకాయలు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని అవయవాలను శుభ్రపరచడంతో పాటు క్యాన్సర్ వంటి పెద్ద జబ్బుల నుంచి కూడా కాపాడుతుందని పరిశోధక నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: కారులో కూర్చున్న వెంటనే ఈ పని చేయకండి.. ప్రాణాలకే ప్రమాదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు