Health Tips: ఈ 5 రకాల పండ్లు రోజు తింటే.. మీ కిడ్నీలు సేఫ్!

రోజు తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు తీసుకుంటే కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలు, పుచ్చకాయ, యాపిల్స్, దానిమ్మ వంటి పండ్లు మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయని వివరిస్తున్నారు.

New Update
Health Tips: ఈ 5 రకాల పండ్లు రోజు తింటే.. మీ కిడ్నీలు సేఫ్!

Health Tips: ఇప్పుడున్న పరిస్థితిల్లో ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పండ్లు తినాలి. ఎందుకు పండ్లు ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్‌,ఫైబర్ శరీరాన్ని, మూత్రపిండాలను శుభ్రపరుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కిడ్నీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కిడ్నీల ఆరోగ్యం కోరుకునేవాళ్లు రోజు తినే ఆహారంలో ఐదు రకాల పండ్లు తీసుకుంటే కిడ్నీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయట. అంతేకాదు కిడ్నీల సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఐదు రకాల పండ్లు ఏమిటి.. వాటిని ఎలా తీసుకోవాలో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

క్రాన్ బెరీస్:

  • క్రాన్ బెరీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోయాంతోసైనడిన్స్ ఉంటాయి. ఇవి కిడ్నీ ఇన్‌ఫెక్షన్ నివారించి కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

నిమ్మకాయలు:

  • నిమ్మకాయలల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. నిమ్మకాయను తినటం వల్ల కిడ్రీల్లో రాళ్లను కరిగి.. మూత్ర నాళాల ఆరోగ్యాన్ని మెరుగుపడుతుంది.

పుచ్చకాయ:

  • పుచ్చకాయలో ఎక్కువ నీటి కంటెంట్‌తో ఉంటుంది. దీనిని రోజూ తీసుకుంటే కిడ్నీలను హైడ్రేట్‌గా ఉంచుతాయి.

యాపిల్స్:

  • యాపిల్స్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయి.

దానిమ్మ:

  • దానిమ్మలో యాంటీ ఇన్ ఫ్లామెటరీ లక్షణాలు పుష్కలం. ఈ కాయను రోజూ తింటే కిడ్నీలను శుభ్రపడి పనితీరును మెరుగుపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు