Super Food : ఈ ఐదు తింటే.. మీరు సూపర్‌ యాక్టివ్‌గా ఉంటారు!

రోజూ తినే ఆహారంలో చెరకు, రేగి పండ్లు, చింతకాయ, ఉసిరికాయ, నువ్వుల లడ్డూలు చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినటం వల్ల ఇన్ఫెక్షన్లు దూరం కావడంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుందని వివరిస్తున్నారు.

Super Food : ఈ ఐదు తింటే.. మీరు సూపర్‌ యాక్టివ్‌గా ఉంటారు!
New Update

Healthy Food: చలికాలం వచ్చే రోజులు దగ్గర్లలోనే ఉంది. రాత్రి, ఊదయం చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో వేడి వేడి టీ, కాఫీ, పకోడి, మిర్చి లాంటివి తినాలి ఎక్కువగా అనిపిస్తుంది. ఆ చలిలో కాఫీ, టీ తాగితే మాజా, అనుభూతి వేరుగా ఉంటుంది. కొందరైతే చలికాలంలో జంక్‌ఫుడ్‌ని ఎక్కువగా తినటానికి ఇష్ట పడుతారు. దానివల్ల వైరల్ ఫీవర్స్‌, జలుబు దగ్గుతోపాటు ఇతర ఆనారోగ్య సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే పోషకాలు ఉన్న ఫుడ్ తినాలి. మనం రోజూ తినే ఆహారంలో ఐదు రకాల ఫుడ్స్ చేర్చుకుంటే చలికాలంలో ఆరోగ్యంగా ఉంటారని న్యూట్రిషన్‌ నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదు రకాలు ఫుడ్స్‌ ఏంటో.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారాలు:

  •  చెరకు రసంలో విటమిన్స్, మినరల్స్ పుష్కలం. చలికాలంలో వారానికి 3 సార్లు చెరకు. జ్యూస్‌ తీసుకుంటే మంచిది. దీనిని డైట్‌లో చేర్చుకుంటే లివర్‌ పనితీరు మెరుగుపడుతుంది.
  •  రేగిపండ్లకు జుజుబి అనే పేరు ఉంది. చలికాలంలో ఎక్కువగా దొరికే పండ్లలో ఇది ఒకటి. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్‌ పెరగటంతో పాటు చర్మానికి మెరుపు వచ్చేలా చేస్తుంది. తరచూ జబ్బు బారిన పడే పిల్లలకు ఈ పండ్లు పెడితే ఆరోగ్యంగా ఉంటారు.
  •  చింతపండులో ఫైబర్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. చింతపండు తినడం వల్ల వెయిట్ లాస్‌తోపాటు డైజెషన్ కూడా బాగా అవుతుంది.
  •  చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్సును ఉసిరికాయ దూరం చేస్తుంది. దీనిని కింగ్ ఆఫ్ వింటర్స్ అంటారు. ఉసిరిలో విటమిన్స్‌ ఏ పుష్కలం. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఉసిరికాయ తినడం ఉత్తమం.
  •  చలికాలంలో నువ్వుల లడ్డూలు తింటే ఎముకలు, కీళ్లు బలపడతాయి. ఇవి టేస్టీ టేస్ట్.. హెల్త్‌కి మంచిది అందుకే డైట్‌లో ఈ ఐదు ఫుడ్స్‌ తీసుకుంటే వింటర్‌ సీజన్‌లో ఇన్ఫెక్షన్స్‌ రాకుండా ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#healthy-food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe