Egg: కొవ్వు పెరగడానికి కోడిగుడ్డు కూడా కారణమా..?.. నిపుణులు ఏమంటున్నారు..?

ఇతర ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉన్నా గుడ్డులో మంచి ప్రొటీన్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు. బాడీకి కావాల్సిన పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. ఇతర అల్పాహారాల కంటే గుడ్డుతో చేసిన టోస్ట్ తింటే 50 శాతం ఎక్కువ సంతృప్తి కొవ్వులు ఉంటాయని వైద్యులు అంటున్నారు.

New Update
Egg: కొవ్వు పెరగడానికి కోడిగుడ్డు కూడా కారణమా..?.. నిపుణులు ఏమంటున్నారు..?

Egg: కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ఉంటాయి. రోజుకు ఒక గుడ్డు తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్యులు కూడా చెబుతుంటారు. మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ గుడ్డులో ఉంటాయి. అయితే గుడ్డును తినే విషయంలో చాలా మందికి ఎన్నో అపోహలు వస్తుంటాయి. గుడ్డు తినడం వల్ల కొవ్వు పెరుగుతుందని అంటుంటారు. పోషకాహార నిపుణులు మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు.

publive-image

గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుందనే వాదన సరికాదంటున్నారు. కండ‌రాల నిర్మాణానికి నూతన క‌ణాల ఉత్పత్తిలో ప్రొటీన్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. శ‌రీరంలో జీవ‌క్రియ‌లు బాగుండాలంటే ప్రొటీన్లు అవసరం. గుడ్డులో ఎక్కువ సంఖ్యలో ప్రొటీన్లు ఉంటాయి. మనకు అవసరమైన ఆమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇతర ఆహార పదార్థాల్లో ప్రొటీన్లు ఉన్నా గుడ్డులో మంచి ప్రొటీన్లు ఉంటాయని నిపుణులు అంటున్నారు.

publive-image

కోడిగుడ్డు వండుకునే విధానం, నిల్వ చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇతర అల్పాహారాల కంటే గుడ్డుతో చేసిన టోస్ట్ తింటే 50 శాతం ఎక్కువ సంతృప్తి కొవ్వులు ఉంటాయని వైద్యులు అంటున్నారు. మామూలు తృణ ధాన్యాల‌ను టిఫన్‌గా తీసుకునేవారి కంటే కూడా గుడ్డును తినేవారు 29శాతం మ‌ధ్యాహ్నం భోజ‌నం తక్కువగా తీసుకుంటున్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది.

publive-image

గుడ్డు తింటే హెచ్‌డీఎల్‌ స్థాయిలు 10 రెట్లు పెరిగినట్టు చెబుతున్నారు. ప్రతిరోజూ గుడ్డు తింటే విట‌మిన్ ఎ అనేది 6 శాతం, విట‌మిన్ బి అనేది 5 శాతం, ఫోలైట్ అనేది 5 శాతంతో పాటు ఫాస్పర‌స్, ఐర‌న్ లభిస్తుందని వైద్యులు అంటున్నారు. కోడిగుడ్డు వల్ల కంటిలో పొరలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గుండె సమస్యలు కూడా రావని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా గుడ్డు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి:  కీళ్ల నొప్పులకు అద్భుత ఆహారం.. తింటే పరుగెత్తడం ఖాయం

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు