Iron Deficiency: ఐరన్‌ లోపం ఉందా..? తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే

శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారం, జీవనశైలిని చాలా చక్కగా ఉంచుకోవాలి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ బ్రోకలీ, గుడ్డు, నానబెట్టిన ఎండుద్రాక్ష వంటి తింటే ఐరన్‌ పుష్కలంగా అందుతుందని వైద్యులంటున్నారు.

New Update
Iron Deficiency: ఐరన్‌ లోపం ఉందా..? తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే

Iron Rich Foods: ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఒక సాధారణ రకం రక్తహీనత లక్షణాలు, కారణాల గురించి తెలుసు. ఈ లక్షణాలు శరీరంలో ఐరన్ లోపం వల్ల కనిపిస్తాయి. శరీరాన్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..ఆహారం, జీవనశైలిని చాలా చక్కగా ఉంచుకోవటంతోపాటు అరగంట వ్యాయామం చేయడం నిపుణులు చెబుతుంటారు. రోజంతా శరీరం ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలంటే చాలా పోషకాలు కావాలి. వాటిలో ఏదైనా లోపం ఉంటే మన శరీరం బలహీనంగా మారుతుంది. అదేవిధంగా ఇనుము కూడా శరీరానికి చాలా ముఖ్యమైనదని అంటారు. శరీరంలో ఐరన్ లోపం (Iron Deficiency) ఉంటే అనేక లక్షణాలు కనిపిస్తాయి. చాలాసార్లు ఈ లక్షణాలను తేలికగా తీసుకుంటాము, వాటిని విస్మరిస్తాము. ఇది సకాలంలో నిరోధించబడకపోతే.. అది తీవ్రమైన రూపం తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. ఐరన్ లోపం వల్ల శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో వాటి వివరాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం.

అలసట-శ్వాస ఆడకపోవడం లక్షణాలు:

ఒక వ్యక్తి శరీరంలో ఐరన్ లోపిస్తే.. అతనికి ఎప్పుడూ ఆయాసం, శరీరం పాలిపోవడం, ఊపిరి ఆడకపోవడం మొదలైన సమస్యలు ఉంటాయి. ఐరన్ లోపం వల్ల రక్తహీనతకు గురవుతారు. శరీరంలో హిమోగ్లోబిన్‌ను నిర్వహించడానికి.. చాలా అయాన్‌లు అవసరం. ఎర్ర రక్త కణాలలో ప్రోటీన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణ ద్వారా శరీరంలో ఆక్సిజన్‌ను బదిలీ చేస్తుంది.

అనేక వ్యాధులు:

ఐరన్ లోపం వల్ల శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారుతుంది. ఐరన్ అనేది శరీరానికి చాలా మేలు చేసే ఖనిజం. శరీరంలో దాని లోపం ఉంటే.. ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.

రక్తహీనతకు తీసుకోవాల్సిన ఫుడ్స్‌:

బ్రోకలీ:

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి బ్రకోలీ (Broccoli) చాలా ముఖ్యం. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అదనంగా, విటమిన్ కె కూడా ఇందులో పుష్కలంగా లభిస్తుంది. రక్తహీనతతో బాధపడుతుంటే రోజూ బ్రకోలీని తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.

Broccoli

గుడ్డు:

గుడ్డు (Egg) శరీరానికి చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ 1-2 గుడ్లు తింటే ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా అందుతుంది. శరీరాన్ని లోపలి నుంచి దృఢంగా ఉంచుకోవాలంటే గుడ్లలో ఉండే విటమిన్ బి పుష్కలంగా పని చస్తుంది.

publive-image

నానబెట్టిన ఎండుద్రాక్ష:

రక్తహీనతను అధిగమించాలనుకుంటే.. ప్రతిరోజూ నానబెట్టిన ఎండుద్రాక్ష తినాలి. దీన్ని రోజూ తినడం వల్ల ముఖం, జుట్టు, పొట్ట రెండింటికీ చాలా మేలు జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్‌లో (Dry Fruits) కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Advertisment
తాజా కథనాలు