Banana: ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ముఖ్యం. లేకుంటే జీవితాన్ని సంతోషంగా ముందుకు నపడలేము. ఎందుకంటే నేటికాలంలో అనేక రకాల వైరస్, రోగాలు వస్తున్నాయి. వీటన్నికి ప్రధాన కారణం చెడు జీవనశైలి. అందుకే ఆరోగ్యం కోసం పోషకాలు, విటమిన్లు, ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలంటారు వైద్యులు. కొందరైతే ఆరోగ్యం కోసం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు అనేక రకాల ప్రయత్నాలతోపాటు వ్యాయామం చేస్తారు. వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మరి ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటాయో చాలామందికి తెలియదు. అయితే మనలో అరటిపండు అంటే ఇష్టం ఉంటుంది.. మరికొందరికి ఇష్టం ఉండదు. ప్రతిరోజూ అరటిపండు తింటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు తింటే బరువు పెరుగుతారని అంటారు. ఈ విషయాలపై కొందరికి అవగాహన లేకపోవచ్చు. అలాంటి వారికోసం ఆహారంలో అరటిపండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు చూద్దాం.
అరటిపండు తినడం వల్ల కలిగే లాభాలు:
- మనం జీవించేందుకు కావాల్సిన విటమిన్లు, మినరల్స్, జీర్ణం అయ్యే ఫైబర్ వంటి పోషకాలను అరటిపండులో పుష్కలంగా ఉన్నాయి. దీనిని
రోజూవారి ఆహారంలో చేర్చడం ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలన్నాయి. - అరటిపండు రోజువారీ అవసరాలకు కావాల్సిన 25% B6 విటమిన్‌ను అందిస్తుంది. ఈపండులో B6 విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోకి ఈజీగా శోషణం చెందుతుంది.
- అరటిపండులో C విటమిన్ తక్కువ. అయినా రోజూవారీ అవసరాలకు కావాల్సిన C విటమిన్‌ని 10 శాతం ఉత్పత్తి చేస్తుంది.
- ఒక్క అరటిపండు మాంగటనీస్ ఖనిజాలను 13 శాతం ఉంటుంది. ఇది కోల్లాజెన్ ఉత్పత్తి, ఫ్రీ రాడికల్స్ నుంచి కణాలను రక్షిస్తుంది.
- అరటిపండులో 320- 400 మిల్లీ గ్రాముల పొటాషియం ఉంటుంది. తీనిని తింటే రోజువారీగా శరీరానికి కావాల్సిన 10 % పొటాషియం ఇస్తుంది.
- రోజూలో అరటిపండు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇది కొవ్వు లేకుండా సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి 3 రకాల చక్కెరలను, సహజ శక్తిని అందిస్తుంది. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులు అరటిపండు తింటే డాక్టర్లని అడిగి తినాలని చెబుతుంటారు. ఏదైనా ఆనారోగ్య సమస్యలు వస్తే జాగ్రత్త వహించి వెంటనే వైద్యలను సంప్రదించాలని చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ ప్రజలకు GHMC అలర్ట్.. డెంగీ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచన!