Amla Benefits: ఉసిరికాయ తినడం వల్ల చర్మం మెరుస్తుందని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఎన్నో పోషకాలు ఉన్న ఈ పండు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఉసిరికాయ తింటే శరీరం క్రమంగా వ్యాధులు తగ్గుతాయని చెబుతున్నారు. నేటి కాలంలో బిజీ జీవితం వల్ల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అందరికి సాధ్య పడని విషయం.గంటల తరబడి ఆఫీస్‌లో కూర్చొని పని చేస్తున్నారు కానీ..శారీరక శ్రమకు సమయం దొరకడం లేదు. అంతేకాకుండా..జంక్,అనారోగ్యకరమైన ఆహారాల వినియోగం అధికంగా పెరిగింది. ఉసిరికాయను రోజూ తింటే అనేక వ్యాధులు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆయుర్వేద పరిశోధన ప్రకారం వీటిలో ప్రాణాంతకమైన వ్యాధులైనా మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని తెలింది.
వ్యాధుల లక్షణాలు:
- ఉసిరిలో విటమిన్ సి, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ బి5, విటమిన్ బి6, కాపర్, మాంగనీస్, పొటాషియం వంటి శక్తివంతమైన అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరిచి.. గుండె, మూత్రపిండాలు, కాలేయ వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇలాంటి వ్యాధుల లక్షణాలు ఏవైనా ఉంటే రోజూ ఉసిరికాయ తింటే మంచిది.
మలబద్ధకం:
- ఉసిరిలో ఫైబర్, హైడ్రేటింగ్ గుణాలు మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రతిఒక్కరూ వారానికి 3 సార్లు కడుపుని ఖాళీ చేయలేకపోతే.. మలబద్ధకం సమస్య ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య ప్రారంభం లక్షణాలు కనిపించినప్పుడు దీనిని తగ్గించడంలో ఉసిరి బెస్ట్‌గా చెబుతున్నారు.
రోగనిరోధక వ్యవస్థ బలహీనత:
- రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వ్యక్తులు అనారోగ్యానికి గురవుతారు. దీనిని నయం చేయడానికి.. విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు చాలా అవసరం. ఉసిరి తింటే బలహీనమైన రోగనిరోధక శక్తి ప్రారంభంలో క్రింది లక్షణాలు కనిపించవచ్చు.
ఈ లక్షలు:
- ఎప్పటికప్పుడు అంటువ్యాధులు, అలసటగా, బలహీనంగా ఉన్నా, కాలేయం, ఆకలి నష్టం, లిబిడో తగ్గింది, పొడి, దురద చర్మం, కళ్ళు, చర్మం పసుపులో మారుతుంది, గుండె, అధిక ldl కొలెస్ట్రాల్,అధిక ట్రైగ్లిజరైడ్స్ స్థాయి, ఊపిరి ఆడకపోవడం, ఛాతి నొప్పి, చేతులు, కాళ్ళలో సిరలు అడ్డుపడతాయి, వికారం, ఎక్కువ లేదా తక్కువ మూత్రవిసర్జన, కండరాల తిమ్మిరి, అడుగుల, చీలమండలలో వాపు, అధిక రక్త పోటు వంటి సమస్యలును ఉంటే ఉసిరి రసం తాగడం వల్ల ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇది కూడా చదవండి: వామ్మో..టీ తాగడం వల్ల బట్టతల వస్తుందా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.