Health Tips: ఆహారం మన శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది. కావున వేలాది సంవత్సరాలుగా ఆహారం,సెక్స్ మధ్య సంబంధాలను కనుగొనడానికి ప్రయత్నించడంలో ఆశ్చర్యం లేదు. అయితే కొన్ని ఆహారాలు మంచి సెక్స్‌లో నిజంగా సహాయపడగలవా? అనే డౌట్ వస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే.. శక్తిని కలిగి ఉండటం కూడా ముఖ్యమని అంటున్నారు. మంచి ఆహారం తీసుకుంటే సెక్స్ శక్తి కూడా పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. మంచి ఆహారం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. సెక్స్ ప్రయోజనాలను పొందడంలో ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు మేలు:
- కొవ్వు చేప, వాల్నట్, అవకాడో, జామున్, బీన్స్, రెడ్ వైన్ , సోయా, కూరగాయలు, ఓట్స్, డార్క్ చాక్లెట్, పండు వంటివి ఎక్కువగా తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్‌లను కలిగి ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. అథ్లెట్లు సమస్య తగ్గటానికి, కండరాల సంకోచానికి, ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి బ్రోకలీ, కర్బూజ, టొమాటో, బంగాళదుంప, పుట్టగొడుగు, కారెట్, పాలు, పెరుగు, నైట్రేట్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తినాలి. ఇవి పొటాషియం కలిగి ఉన్న కొన్ని ఆహారాలు కావున సెక్స్ సమయంలో శక్తిని ఇస్తుంది.
వెల్లుల్లి-సెక్స్:
- వెల్లుల్లి, డార్క్ చాక్లెట్, ఆకుకూరలు, ఎరుపు మాంసం, దానిమ్మ, వాల్నట్, విత్తనాలు, ఆమ్ల ఫలాలు వంటివి కండరాలపై వాటి సానుకూల ప్రభావాలు సెక్స్ సమయంలో అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.
సెక్స్ ఫుడ్:
- రెడ్ వైన్ తాగడం వల్ల లిబిడో పెరుగుతుంది.
- మెంతి గింజలు స్త్రీ లైంగిక కోరిక, ఉద్రేకాన్ని పెంచుతాయి.
- ట్రిబులస్ టెర్రెస్ట్రిస్ మొక్క లైంగిక బలహీనతతో బాధపడుతున్న మహిళల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను, లైంగిక సంతృప్తిని పెంచుతుంది.
- కొన్ని ఆహారాలు కొంతమందికి సెక్స్‌ను మెరుగుపరుస్తాయి. అయితే ఆహారాలు సెక్స్ కోసం పూర్తిగా పనిచేస్తాయో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని నిపుణులు అంటున్నారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తింటే మరింత శక్తివంతంగా ఉంటారు. లైంగిక జీవితాన్ని సానుకూలంగా ఉంటుందని సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మీ పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా..అయితే ఇలా చేయండి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.