Seema Chinthakaya : సీమ చింతకాయల నమిలి తినండి.. ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకోండి! గ్రామాల్లో ఉండే వారికి సీమ చింతకాయల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ కాయలను తింటే శరీరంలో రోగ నిరోధకశక్తి, జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తం శుద్ది అవుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అందుతాయి. సీమ చింతకాయలను బాగా నమిలి తినడం వల్ల దంతాలు క్లీన్ అవుతాయి. By Vijaya Nimma 28 Nov 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Seema Chinthakaya: ప్రకృతిలో మనకు వివిధ రకాల పండ్లు, కూరగాయలు కాలానుగుణంగా దొరుకుతాయి. ఇలా కాలానుగుణంగా వచ్చే పండ్లను తింటే మనం ఆ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా కాలానుగుణంగా వచ్చే వివిధ రకాల పండ్లల్లో సీమ చింతకాయలు ఒకటి. వేసవి కాలంలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. గ్రామాల్లో ఉండే వారికిసీమ చింతకాయల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. ఈ కాయలు ఎక్కువగా పొన చర్మం గులాడి, ఎరుపు రంగుల్లో ఉంటాయి. లోపల తెల్లగా ఉండే గుజ్జుతో పాటు నల్ల రంగులో ఉండే గింజ వీటిల్లో ఉంటాయి. ఈ తెల్ల గుజ్జును మాత్రమే మనం తినాలి. శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అధిస్తుంది ఈ సీమ చింతకాయలు తీపి, వగరు రుచితో ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఈ సీమ చింతకాయలను కొన్ని పాత్రాల్లో జింగిలం జిలేజి అని పిలుస్తారు. రుచిగా ఉండే ఈ కాయలను తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిలో ప్రోటీన్స్, పీచు పదార్థాలు, విటమిన్- బి1, బి6, ఏ, సీ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిల్లో కొవ్వులు చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. ఈ కాయలను తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి, జీర్ణశక్తి పెరిగి.. రక్తం శుద్ది అయ్యి..శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అధిస్తుంది. సీమ చింతకాయలను బాగా నమిలి తినడం వల్ల దంతాలు శుభ్రపడి.. ఎముకలను ధృడంగా ఉంచుతుంది. Also Read: నల్ల జామకాయలతో ఆరోగ్యానికి జరిగే మేలు తెలుసుకుంటే షాక్ అవుతారు! బరువు తగ్గాలనుకునే వారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. కంటి ఆరోగ్యాన్ని, కంటి చూపును పెంచడంలో ఈ కాయలు బాగా పని చేస్తాయి. అలాగే.. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తిన్న ఆరోగ్యానికి మంచిదే. గర్భిణీ స్త్రీలల్లో వచ్చే మలబద్దకం సమస్యను తగ్గిచ్చి.. శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ చక్కగా అందుతాయి. ఈ కాయలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగుపడి, రక్తనాళాలు చక్కగా పని చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. సీమచింతకాయలను తినడం వల్ల గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు తగ్గి ప్రశాంతత ఉంటాయి. ఈ విధంగా సీమ చింతకాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇవి లభించే కాలంలో వీటిని ఖచ్చితంగా తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. #health-benefits #seema-chimankaya మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి