Earth Quake In Gujarat: భారత్ లో వరుస భూకంపలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో భూకంపం సంభవించింది. ఈరోజు మధ్యాహ్నం 3.18 గంటలకు సౌరాష్ట్రలోని తలాలా ప్రాంతంలో ఉత్తర-ఈశాన్యంగా 12 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు గుజరాత్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తెలిపింది.
ALSO READ: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో..
హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో గత నెల 4వ తేదీ రాత్రి 9:35 గంటలకు భారీ భూకంపం సంభవించింది. అకస్మాత్తుగా భూకంపం రావడంతో ప్రజలను ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తి సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంపం కారణంగా జిల్లాలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఆ రోజు రాత్రి 9:35 గంటల ప్రాంతంలో మూడు నాలుగు సార్లు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. చంబా నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలిలో కూడా బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. చంబాకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఇదిలా ఉండగా..1905న ఇదేరోజు (ఏప్రిల్ 4)న కాంగ్రా జిల్లాలో భూకంపం సంభవించి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.