Business Idea: వచ్చేది వేసవి కాలం.. ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. నెలకు రూ. 15లక్షలు గ్యారెంటీ..ఎలాగో తెలుసా? సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి జ్యూస్ బిజినెస్ బెస్ట్ ఐడియా. ఇందులో పెట్టుబడి 5 లక్షల నుంచి 7లక్షల వరకు ఉంటుంది. ఏడాది పొడవునా ఈ వ్యాపారం సాగుతుంది. వేసవిలో మరింత డిమాండ్ ఉంటుంది. సీజన్ కు అనుగుణంగా జ్యూస్ రకాలను మార్చుకుంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. By Bhoomi 21 Feb 2024 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Business Idea: మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి కావాల్సినంత సమతుల్య ఆహారం అందించాలి. అవసరమైన పోషకాలు తప్పనిసరి. పండ్లు మన ఆహారంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కోవిడ్ వైరస్ దాడి తర్వాత మనదేశంలో ప్రజలకు ఆరోగ్యంపై చాలా అవగాహన పెరిగింది. దీనికి జ్యూసు షాపులే నిదర్శనమని చెప్పవచ్చు. జ్యూష్ షాపుల్లో పండ్లు, కూరగాయల జ్యూసులు మాత్రమే కాదు ప్రొటీన్ షేక్ వంటి ఆరోగ్యరమైన పానీయాలను కూడా విక్రయిస్తారు. అయితే మీరు స్వంతగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లయితే..జ్యూస్ బిజినెస్ చక్కటి ఆలోచన. జ్యూస్ వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి ఎంత అవసరం. మనకు ఎంత లాభం వస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వచ్చేది వేసవికాలం. ఈ కాలంలో జ్యూస్ బిజినెస్ ప్రారంభిస్తే మంచి లాభాలను పొందవచ్చు. ముందుగా జ్యూస్ కార్నర్ ప్రారంభించేందుకు కార్పొరేషన్, మున్సిపాలిటీ, పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అవసరమైన అనుమతులు పొందిన తర్వాత జ్యూస్ షాప్ ను ప్రారంభించే స్థలాన్ని ఎంచుకోవాలి. మీకు స్వంత స్థలం ఉన్నా లేదంటే అద్దెకు తీసుకున్న స్థలం అయినా సరే ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతంలో అయితే మంచిది. ఎందుకంటే రద్దీగా ఉండే ప్రాంతాల్లో తొందరగా క్లిక్ అవుతుంటాయి. ఇక ఫ్రూట్ మిక్సర్, కట్టింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ వంటి పరికరాలను మార్కెట్లో ఎక్కుడైతే తక్కువ ధరకు లభిస్తాయో తెలుసుకుని కొనుగోలు చేయాలి. లేదంటే ఈ రోజుల్లో ఆన్ లైన్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. నచ్చిన ధరల్లో తీసుకోవచ్చు. ముఖ్యంగా రోజువారీ జిమ్ కు వెళ్లేవారు, ఫిట్నెస్ ఔత్సాహికులు, ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే వ్యక్తులున్న ప్రాంతంలో ఈ బిజినెస్ ప్రారంభించడమనేది మంచి ఆలోచన. స్పెషల్ ఆఫర్స్, ప్రమోషన్స్ అందించడం, ఫిట్నెస్ దగ్గర షాపును ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇక ఈ బిజినెస్ ప్రారంభించడానికి మీకు దాదాపు 5 నుంచి 7లక్షల పెట్టుబడి అవసరం. ఏడాది పొడవునా మీరు సీజన్ కు అనుగుణంగా జ్యూసుల రకాలను మార్చుకునే వీలుంటుంది. జ్యూస్ వ్యాపారంలో లాభదాయకత స్థానం నుంచి ప్రదేశం మార్చుకోవచ్చు. మీరు విక్రయించే ప్రతిగ్లాసు జ్యూసుపై 50 నుంచి 70శాతం లాభం పొందుతారు. ఇది కూడా చదవండి: ఎలాంటి తనఖా లేకుండానే రూ. 50వేల నుంచి 10లక్షల వరకు లోన్…మీరు అర్హులో కాదో తెలుసుకోండి..! #business-idea #business-ideas #best-business #juice-business మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి