Old Governments : భారత విదేశాంగ మంత్రి జైశంకర్(Jai Shankar) తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాల విదేశంగ విధానం కూడా ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు ప్రభావితం అయ్యేదంటూ కామెంట్ చేశారు. ఓ ఇంటర్వ్యూ(Interview) లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. 1948లో ఇజ్రాయిల్ కు ఇండిపెండెన్స్(Israel Independence) వచ్చిందన్నారు. అప్పటి నుంచి 1992 వరకు మన దేశ అంబాసిడర్ ను అక్కడికి ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. 1992లో మన అంబాసిడర్ ను అక్కడి పంపించామన్నారు. అయితే.. అప్పటి నుంచి 2017 వరకు మన దేశ ప్రధాని ఇజ్రాయెల్ ఎందుకు పోలేదన్నారు. దీంతో ఎన్నికల వేళ కేంద్ర విదేశంగ మంత్రి ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
Also Read : పొమ్మనలేక పొగబెట్టడం అంటే ఇదే..కంపెనీల క్వైట్ ఫైరింగ్