e-waste: ఈ-వేస్ట్ పర్యావరణంతో పాటు ఆరోగ్యానికీ హానికరమా?

భారతదేశంలో ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 19.8 శాతం ఈ-వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. 47,810 టన్నులు మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బెంగళూరు నిలయం. ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఇది మూడో స్థానంలో ఉంది.

e-waste: ఈ-వేస్ట్ పర్యావరణంతో పాటు ఆరోగ్యానికీ హానికరమా?
New Update

e-waste: భారతదేశంలో ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 19.8 శాతం ఈ-వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. 47,810 టన్నులు మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బెంగళూరు నిలయం. ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఇది మూడో స్థానంలో ఉంది.

ఈ-వేస్ట్ అంటే..?

రిపేర్‌ సాధ్యంకాని టీవీ, మొబైల్, స్మార్ట్‌ఫోన్, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఓవెన్, ప్రింటర్, కీ బోర్డు, ఎయిర్ కండీషనర్, జిరాక్స్ సహా 23 రకాల ఎలక్ట్రానిక్స్ పరికరాలను ఈ-వేస్ట్‌గా పరిగణిస్తారు. ఈ-వ్యర్థాలు సరిగా శుద్ధి చేయకపోతే పర్యావరణం, మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలలో ఆర్సెనిక్, లెడ్, మెర్క్యురీ, కాడ్మియంలాంటి భారీ లోహాలు నీటి వనరులు, నేలతో సహా పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో భారతదేశం 5వ ఉత్పత్తిదారుగా ఉంది. ఏటా 18.5 లక్షల టన్నుల ఈ-వ్యర్థాలు వెలువడుతున్నాయని ఓ నివేదికలో తేలింది. భారతదేశంలో ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. తమిళనాడు 13%, ఉత్తరప్రదేశ్ 10.1%, పశ్చిమ బెంగాల్ 9.8%, న్యూఢిల్లీ 9.5%, కర్ణాటక 8.9%, గుజరాత్ 8.8%, మధ్యప్రదేశ్ 7.6% తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నగరాల విషయానికి వస్తే ముంబై మొదటి స్థానంలో ఉంది. ఈ-వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరాల్లో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఢిల్లీ ఉంది.

ఈ-వేస్ట్ రూల్స్:

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ ఈ-వ్యర్థాల నిర్వహణ కోసం ఈ-వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్-2011ను మే 1, 2012 నుంచి అమలులోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారులు, పంపిణీదారులు, కొనుగోలుదారులపై వ్యర్థాల నిర్వహణ బాధ్యత ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సమయంలో ఉత్పన్నమయ్యే ఈ-వ్యర్థాల శుద్ధి బాధ్యత తయారీదారు భుజాలపైనే ఉంచారు. తయారీదారులు ఈ-వ్యర్థాల సేకరణ యూనిట్‌ను ప్రారంభించాలి. ఈ-వ్యర్థాల సేకరణ యూనిట్ల చిరునామాలను వినియోగదారులకు తప్పనిసరిగా అందించాలనే నిబంధన ఉంది.

ఇది కూడా చదవండి: కారం తినడం వల్ల లాభాలు తెలిస్తే మంటపుట్టినా తినడం ఆపరు

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#e-waste
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe