Cars: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా...ఈ ఆఫర్ కొద్దిరోజులే..!!

మీరు బడ్జెట్ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మారుతీ సుజుకీ పలు మోడళ్లపై రూ. 62వేలకు డిస్కౌంట్ ఆఫర్స్ కల్పిస్తోంది. మారుతీ సుజుకీ ఆల్టో కే10, మారుతీ సుజుకీ ఎస్-ప్రెస్సో ఏఎంటీ వర్షన్,మారుతీ సుజుకీ సెలేరియో పై ఈ డిస్కౌంట్ ను ప్రకటించింది.

Cars: బంపర్ ఆఫర్..రూ. 4లక్షలకే కొత్త కారు..62వేల డిస్కౌంట్ కూడా...ఈ ఆఫర్ కొద్దిరోజులే..!!
New Update

Cars : దేశీయ ప్రముఖ కార్ల తయారీదారుసంస్థ మారుతీ సుజుకీ ఈ ఫిబ్రవరి నెలలో డిస్కౌంట్ ఆఫర్స్ ను ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన హ్యాచ్ బ్యాక్ రేంజ్ మోడళ్లపై రూ. 62వేల వరకు డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ మారుతీ సుజుకీ మోడల్స్ పై క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజీ బోనస్, కార్పొరేట్ ప్రయోజనాలు వంటి ఉంటాయన్న సంగతి గమనించాలి. అలాగే మీరు ఫ్యామిలీ కోసం బడ్జెట్ ధరలో మంచి కారును కొనుగోలు చేయాలనుకుంటే మారుతీ సుజుకీ కంపెనీకి చెందిన ఆల్టో కే10 బెస్ట్ అని చెప్పాలి. మన దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది.

మారుతీ సుజుకీ ఆల్టో కే10 ప్రస్తుతం మంచి డిస్కౌంట్ ఆఫర్ లో అందుబాటులో ఉంది. తాజా వెర్షన్ కే10పెట్రోల్ వేరియంట్ పై రూ. 62వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ కారు ధర వేరియంట్ ను బట్టి రూ. 3.99లక్షల నుంచి రూ. 5.96లక్షల వరకు ఉంది. అంటే రూ. 4లక్షలకే కొత్త కారు కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. దీనిపై ఈ ఫిబ్రవరి నెలలో రూ. 62వేల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది.ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 40వేలుగా ఉంది. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 15వేల వరకు వస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 7వేలు లభిస్తుంది. అలాగే సీఎన్జీ వెర్షన్ పై మొత్తంగా రూ. 30వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

మారుతీ సుజుకీ ఎస్ ప్రెస్సో ఏఎంటీ వెర్షన్ పైనా రూ. 61వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఫిబ్రవరి 2024 ఆఫర్ లో భాగంగా రూ. 40వేల క్యాష్ డిస్కౌంట్ ఎక్స్చేంజీ బోనస్ రూ. 15వేలు పొందవచ్చు. అలాగే కార్పొరేట్ బెనిఫిట్స్ రూ. 6వేల వరకు లభిస్తాయి. అలాగే ఎస్ ప్రెస్సో మాన్యువల్ వేరియంట్స్ పై రూ. 56వేల వరకు బెనిఫిట్స్ ఉంటాయి. అందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 30వేలు, ఎక్స్చేంజీ బోనస్ రూ. 20వేలు, కార్పొరేట్ బెనిఫిట్స్ రూ. 6వేల వరకు ఉంటాయి. ఎస్ ప్రెస్సో సీఎన్జీ వెర్షన్స్ పై రూ. 36 వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

అలాగే మారుతీ సుజుకీ సెలేరియోపై రూ. 61వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎస్ ప్రెస్సో మాదిరిగానే రూ. 40 వేల క్యాష్ డిస్కౌంట్ రూ. 15వేల ఎక్స్చేంజీ బోనస్, రూ. 6వేల కార్పొరేట్ బెనిఫిట్స్ ఉన్నాయి. అన్ని పెట్రోల్ వేరియంట్లపైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే మారుతీ సుజుకీ సెలేరియా సీఎన్జీ వేరియంట్ పై రూ. 36వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి:  జియో, ఎయిర్ టెల్ కొత్త రీచార్జ్..ప్లాన్ ఒక్కటే..బెనిఫిట్సే బోలేడు..!!

#business-news #maruti-suzuki #celerio #alto-k10
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe