/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/insurance-jpg.webp)
E-Insurance To Become Mandatory : ఇక నుంచి ప్రతి ఒక్కరూ తీసుకునే బీమా(Insurance) పాలసీలను డిజిటలైజ్(Digitalize) చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యలేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. దీంతో బీమా సంస్థలన్నీ కూడా తమ పాలసీదారులకు ఇచ్చే పాలసీలన్ని కూడా '' ఈ-ఇన్సూరెన్స్'' పద్దతిలోనే పాలసీలు ఇవ్వాల్సి ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance) , జీవిత బీమా, జనరల్(General Insurance) ఇన్సూరెన్స్ తో పాటు అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలకు ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. ఈ విధానం కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ- ఇన్సూరెన్స్ అకౌంట్ అనే ఆన్ లైన్ అకౌంట్ లో బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో సేవ్ చేస్తారు.
ఈ అకౌంట్ సాయంతో పాలసీదారులు,తమ ఇన్సూరెన్స్ పాలసీ ప్లాన్లను ఆన్లైన్ లోనే యాక్సెస్ చేయోచ్చు. ఇన్సూరెన్స్ పాలసీ(Insurance Policy) లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో వీటి వినియోగం సులభతరం చేయాలని ఐఆర్డీఏఐ భావిస్తుంది. పూర్తిగా కాగితం రహితం కావడంతోపాటు ఆన్ లైన్‌లో ఉండటం వల్ల డాక్యుమెంట్లు పోయినప్పటికీ మళ్లీ వెంటనే డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
వీటిని రెన్యూవల్ కూడా ఈజీగా చేయించుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీల అడ్రస్ మార్చాలన్నా,వివరాలు అప్‌డేట్ చేయాలన్న కూడా ఈ -ఇన్సూరెన్స్ తో చాలా ఈజీగా అవుతుంది. దీనికి తోడు పాలసీల డిజిటలైజేషన్ వల్ల ఇన్సూరెన్స్ సంస్థలకు, పాలసీదారుల మధ్య కమ్యూనికేషన్స్ బాగుంటాయి.
Also Read : పాన్ కార్డు దుర్వినియోగం.. పాపం ఆ విద్యార్థికి రూ.46 కోట్లకు…