T20 World Cup 2024 : టీ 20 ప్రపంచ కప్ కోసం అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. ఈ మెగా టోర్నీకి అతికొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వరల్డ్ కప్ లో గతంలో ఊహించని సంచలనాలు సృష్టించిన ఆఫ్గనిస్థాన్(Afghanistan) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇయర్ జరగబోతున్న టీ 20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ను బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించింది.
ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ బోర్డు ట్విట్టర్ (X) వేదికగా వెల్లడించింది. స్లో పిచ్ లు ఉండే విండీస్ గడ్డపై తమ బౌలింగ్ టీమ్ కి బ్రావో ఎంతో హెల్ప్ అవుతాడని ఆఫ్ఘాన్ బోర్డు గట్టిగానే విశ్వసిస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ (International Cricket) లో టాప్ ప్లేయర్ గా రాణించిన బ్రావో విండీస్ గెలిచిన టీ 20 వరల్డ్ కప్ లో ఓ సభ్యుడు కావడం విశేషం.
Also Read : ధోని మళ్ళీ ఐపీఎల్ ఆడటం వాళ్ళ చేతుల్లోనే ఉంది : అంబటి రాయుడు
టీ 20 ల్లో అత్యధిక వికెట్స్ తో హిస్టరీ క్రియేట్ చేసిన బ్రావోకి ఐపీఎల్ కోచ్ గా సేవలందించిన అనుభవం కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బౌలింగ్ యూనిట్ కి కోచ్ గా ఉన్న బ్రావో.. త్వరలోనే అఫ్గనిస్థాన్ టీమ్ తో జాయిన్ కానున్నాడు. కాగా ఇప్పటికే కాబూలీ బృందం విండీస్ చేరుకుంది.
అక్కడి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్‌లో కోచింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో 10 రోజులు శిక్షణ శిబిరంలో పాల్గొనుంది. ఇక అప్ఘనిస్థాన్ బౌలింగ్ అసిస్టెంట్‌గా ఎంపికైన బ్రావో వరల్డ్ కప్ పరీక్షలో నెగ్గుతాడా? లేదా? అనేది త్వరలోనే తేలిపోతుంది.